అండమాన్ నికోబార్ దీవుల్లోని బరాటంగ్‌లో దాదాపు రెండు దశాబ్దాలకు పైగా నిద్రాణస్థితిలో ఉన్న భారత ఏకైక అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. అక్టోబరు 2న భారీ శబ్దంతో అగ్నిపర్వతం విస్ఫోటం చెందిందని అధికారులు 2025, అక్టోబరు 3న తెలిపారు.
దీంతో 3 నుంచి 4 మీటర్ల మేర మట్టిదిబ్బ ఏర్పడింది. 1,000 చదరపు మీటర్ల మేర బురద వ్యాపించింది.
ప్రముఖ పర్యాటక ప్రాంతమైన జర్వాక్రీక్‌లో ఉన్న ఈ అగ్నిపర్వతం చివరిసారిగా 2005లో బద్దలైంది.