హైదరాబాద్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గౌహర్ సుల్తానా (37 ఏళ్లు) క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. 2008లో పాకిస్థాన్‌పై అరంగేట్రం చేసిన ఆమె భారత్ తరఫున 50 వన్డేలు, 37 టీ20లు ఆడింది. ఆమె 2014 ఏప్రిల్‌లో పాకిస్థాన్‌పై చివరి అంతర్జాతీయ మ్యాచ్ (టీ20)లో పాల్గొన్నారు. గౌహర్ వన్డేల్లో 66 వికెట్లు, టీ20ల్లో 29 వికెట్లు పడగొట్టింది. 2009, 2013 వన్డే ప్రపంచకప్‌ల్లోనూ ఆడి 11 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసింది. 2009 - 2014 మధ్య మూడు టీ20 ప్రపంచకప్‌లలో పాల్గొని ఏడు వికెట్లు పడగొట్టింది.