అత్యధిక కాలం కేంద్ర హోం మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా అమిత్ షా రికార్డు సృష్టించారు. ఆయన పదవి చేపట్టి 2025, ఆగస్టు 5 నాటికి 6 సంవత్సరాల 68 రోజులు పూర్తయ్యాయి. అంతకు ముందు అత్యధిక కాలం కేంద్ర హోం మంత్రిగా పనిచేసిన నాయకుడిగా ఎల్.కె.ఆడ్వాణీ (6 ఏళ్ల 64 రోజులు) నెలకొల్సిన రికార్డును అమిత్ షా అధిగమించారు.
• 2,258 రోజుల పాటు ఈ పదవిలో సాగిన అమిత్ షా ఖాతాలో అనేక విజయాలు నమోదయ్యాయి. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370వ రాజ్యాంగ అధికరణం రద్దు, బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో మూడు న్యాయ సంహితల అమలు వంటి కీలక ఘట్టాలు ఆయన చేతుల మీదుగా జరిగాయి.