జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా పీబీ బాలాజీ నియమితులయ్యారు. ఈ బ్రిటిష్ దిగ్గజ బ్రాండ్ తొలిసారిగా ఒక భారతీయుడిని ఈ స్థానంలో నియమించింది. ప్రస్తుత సీఈఓ యాండ్రియన్ మార్డెల్ పదవీ విరమణ చేయాలని భావించిన నేపథ్యంలో, కంపెనీ తాజా నిర్ణయం తీసుకుంది. కంపెనీలో 35 ఏళ్లుగా పనిచేసిన యాడ్రియన్.. మూడేళ్ల నుంచీ సీఈఓగా ఉన్నారు.