శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని భౌతికశాస్త్ర విశ్రాంత ఆచార్యుడు రాజూరు రామకృష్ణారెడ్డి యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ‘రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ’ అనే సంస్థ ఫెలోగా ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 55 వేల మంది ఇందులో సభ్యులుగా ఉంటారు. అసాధారణ పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలకు ఇందులో చోటు దక్కుతుంది. సైద్ధాంతిక, భౌతిక, పర్యావరణ శాస్త్రాల్లో రామకృష్ణారెడ్డి పరిశోధనలు గావించారు. ఆయా రంగాల్లో 244 పరిశోధన ప్రతులు, గూగుల్ సైటేషన్స్ 6439, ఐ10 ఇండెక్స్ 125, హెచ్ ఇండెక్స్ 45 పొందారు.