భారత టెన్నిస్‌లో స్టార్ రోహన్ బోపన్న (45 ఏళ్లు) 2025, నవంబరు 1న సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. చివరిగా అతడు పారిస్ మాస్టర్స్‌లో అలెగ్జాండర్ బబ్లిక్ (కజకిస్థాన్)తో కలిసి బరిలో దిగి తొలి రౌండ్లోనే ఓడాడు. 2000లో ప్రొఫెషనల్‌గా మారిన బోపన్న.. విజయవంతమైన డబుల్స్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నాడు.
రెండు దశాబ్దాల కెరీర్‌లో డేవిస్ కప్, గ్రాండ్‌స్లామ్ టోర్నీలు, ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2017లో దబ్రౌస్కీ (కెనడా)తో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ సాధించాడు. కెరీర్‌లో అతడికి అదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్.