ఒలింపిక్ స్వర్ణపతక విజేత, స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు భారత సైన్యంలో లెఫ్టినెంట్ కర్నల్‌గా గౌరవ హోదాను కల్పించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 2025, అక్టోబరు 22న చోప్రాకు ఈ హోదాను ప్రదానం చేశారు. చోప్రా 2016లో నాయబ్ సుబేదార్‌గా సైన్యంలో తన కెరీర్‌ను ఆరంభించాడు. 2016లో సుబేదార్‌గా, 2022లో సుబేదార్ మేజర్‌గా అతడికి పదోన్నతి లభించింది.