2-నానోమీటర్‌ సెమీకండక్టర్‌

2-నానోమీటర్‌ సెమీకండక్టర్‌
  • కొత్తతరం అవసరాలకు అనుగుణంగా నానో మీటర్‌ సెమీకండక్టర్‌ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ 2026, ఫిబ్రవరి 7న బెంగళూరులో ఆవిష్కరించారు. క్వాల్‌కమ్‌ సంస్థ అభివృద్ధి చేసిన 2నానోమీటర్‌ (ఎన్‌ఎం) సెమీకండక్టర్‌ భారతీయ 5వ పారిశ్రామిక విప్లవానికి ప్రతీకగా ఆవిష్కృతమైందన్నారు.
  • అత్యాధునిక మైక్రో ఎలక్ట్రానిక్స్‌లతో తయారైన ఈ చిప్‌లో 20-30 బిలియన్ల ట్రాన్సిస్టర్లు ఉన్నాయి. జీపీయూ, సీపీయూల సామర్థ్యం ఒకే చిప్‌లో ఉన్న ఈ సెమీకండక్టర్‌ కొత్తతరం కృత్రిమ మేధను ఆటోమొబైల్స్, విమానాలు, హైస్పీడ్‌ రైళ్ల సేవల్లో విస్తృతంగా వినియోగించేందుకు దోహదపడుతుందని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram