ఎస్‌ఎఫ్‌డీఆర్‌ టెక్నాలజీ పరీక్ష విజయవంతం

ఎస్‌ఎఫ్‌డీఆర్‌ టెక్నాలజీ పరీక్ష విజయవంతం
  • అధునాతన సాలిడ్‌ ఫ్యూయెల్‌ డక్టెడ్‌ రామ్‌జెట్‌ (ఎస్‌ఎఫ్‌డీఆర్‌) చోదక వ్యవస్థతో పనిచేసే క్షిపణి పరిజ్ఞానాన్ని భారత్‌ 2026, ఫిబ్రవరి 3న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలోని సమీకృత పరీక్ష వేదిక (ఐటీఆర్‌) నుంచి ఈ ప్రయోగం జరిగింది. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల కొత్తతరం దీర్ఘశ్రేణి క్షిపణులను అభివృద్ధి చేయడానికి ఈ టెక్నాలజీ దోహదపడుతుంది. ఈ సాంకేతికత కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్‌ చేరింది.
  • దీర్ఘశ్రేణి, అధిక వేగం, గాల్లో సులువుగా విన్యాసాలు చేయగలిగిన సామర్థ్యం లాంటి లక్షణాల వల్ల ఎస్‌ఎఫ్‌డీఆర్‌ క్షిపణి నుంచి తప్పించుకోవడం శత్రు యుద్ధవిమానానికి చాలా కష్టం.
  • రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఈ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. ఇందులో హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి ల్యాబ్‌ (డీఆర్‌డీఎల్‌), రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (ఆర్‌సీఐ), పుణెలోని హై ఎనర్జీ మెటీరియల్స్‌ రిసెర్చ్‌ ల్యాబ్‌ ముఖ్యపాత్ర పోషించాయి. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram