భారత్ విజయవంతంగా ప్రళయ్ క్షిపణి పరీక్షలను 2025, డిసెంబరు 31న నిర్వహించింది. ఒడిశా తీరం నుంచి వరుసగా ఒకదాని వెంట ఒకటి రెండు ప్రళయ్ మిసైళ్లను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ప్రయోగించింది. ఈ రెండూ.. నిర్దేశిత లక్ష్యాలను ఛేదించాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణులను డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది.