అగ్ని-5 బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

అగ్ని-5 బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

మధ్యమ శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి అయిన ‘అగ్ని-5’ను భారత రక్షణ శాఖ 2025, ఆగస్టు 20న విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని చాందీపుర్‌ పరీక్షా కేంద్రంలో ఈ ప్రయోగం జరిగింది. భారత అణ్వాయుధ కార్యకలాపాల నిర్వహణ, నియంత్రణలకు బాధ్యత వహించే స్ట్రాటజిక్‌ ఫోర్సెస్‌ కమాండ్‌ పర్యవేక్షణలో ఈ ఖండాంతర క్షిపణి పరీక్ష జరిగింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేస్తున్న ఈ క్షిపణి పరిధి 5 వేల కిలోమీటర్లు. ఒకేసారి మూడు అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లి.. ఫైర్‌ చేసే సామర్థ్యం దీనికి ఉంది. 

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram