విదేశీ డిజిటల్ సర్వీసులపై ఆధారపడకుండా సొంత డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతో వాట్సప్‌కు ప్రత్యామ్నాయంగా రష్యా సొంత యాప్‌ను రూపొందించింది. ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్, ట్యాబ్లెట్‌లలో ప్రీ-ఇన్‌స్టాల్ యాప్‌గా ‘మ్యాక్స్’ను ఉంచాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ యాప్‌లో ప్రభుత్వ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.