లద్దాఖ్‌లో పండే బెర్రీలు (సీబక్‌థోర్న్), హిమాలయన్ గోధుమల (బక్‌వీట్) విత్తనాలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్‌ఎస్) పరీక్షించేందుకు రంగం సిద్ధమైంది. ఇటీవల ప్రయోగించిన క్రూ-11 మిషన్ ద్వారా వీటితోపాటు 11 దేశాలకు చెందిన విత్తనాలను ఐఎస్‌ఎస్‌కు తీసుకెళ్లిన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వాటిని పరీక్షించనుంది. బయో ఆస్ట్రోనాటిక్స్ సంస్థ జాగ్వార్ స్పేస్ ఈ ప్రయోగంలో భాగంగా వారంపాటు విత్తనాలను మైక్రోగ్రావిటీ పరిస్థితులకు తీసుకెళ్లి పరీక్ష జరపనుంది.