హృద్రోగుల కోసం భారత్‌లో రూపొందించిన కొత్తతరం స్టెంట్ - సూప్రాఫ్లెక్స్ క్రజ్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. టుక్సెడో-2 పేరుతో దీనిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. రిస్కు ఎక్కువగా ఉన్న రోగుల్లో ఇది.. అమెరికాలో తయారైన ఇలాంటి ఉపకరణంతో పోలిస్తే దీని వైఫల్య రేటు చాలా తక్కువని తేలింది. ఈ సాధనాన్ని.. అంతర్జాతీయ మార్కెట్‌లో అగ్రపథంలో ఉన్న క్సైన్స్ అనే స్టెంట్‌తో పోల్చి చూశారు.