అతిపెద్ద అణు విద్యుత్‌ కేంద్రం పునఃప్రారంభం

అతిపెద్ద అణు విద్యుత్‌ కేంద్రం పునఃప్రారంభం
  • ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్‌ కేంద్రమైన కాషివాజాకి-కరీవా ప్లాంట్‌ను జపాన్‌ 2026, ఫిబ్రవరి 9న పునఃప్రారంభించింది. గతంలో సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయిన ఈ కర్మాగారం తిరిగి విద్యుదుత్పత్తికి సిద్ధమైంది. 2011లో సంభవించిన భారీ భూకంపం, సునామీ కారణంగా ఫుకుషిమా ప్లాంట్‌లో ప్రమాదం సంభవించింది. దీంతో దేశవ్యాప్తంగా అణు విద్యుత్‌ కేంద్రాలను జపాన్‌ ప్రభుత్వం మూసివేసింది.
  • ఆ తర్వాతి పరిస్థితుల్లో.. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావించింది. 2050 నాటికి ‘కార్బన్‌ న్యూట్రాలిటీ’ సాధించడానికి, కృత్రిమ మేధ (ఏఐ) అవసరాలకు పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ను తట్టుకోవడానికి మళ్లీ అణుశక్తి వైపు మొగ్గు చూపుతోంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram