చైనా తన నౌకాదళంలోకి మరింత మెరుగుపరిచిన మిసైల్ డిస్ట్రాయర్‌ను చేర్చింది. టైప్ 052డి తరగతికి చెందిన ఈ యుద్ధనౌకకు లౌడీ అని పేరు పెట్టారు. ఇందులో మెరుగైన రాడార్, ఆయుధ, నెట్‌వర్క్ వ్యవస్థలు ఉన్నాయి. దీనివల్ల ఇది గగనతల రక్షణ, సాగరంలో దాడి, టాస్క్‌ఫోర్స్ కమాండ్ లాంటి విధులను నిర్వర్తించగలదు. ఇది లక్షిత యుద్ధనౌకలపై దాడి చేయడంతోపాటు సహచర నౌకలను రక్షించగలదు.
చైనా నేవీ సగటున నెలకో కొత్త యుద్ధనౌకను చేర్చుకుంటోంది. అమెరికా నౌకాదళాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఈ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం చైనా నౌకాదళంలో 234, అమెరికా నేవీలో 219 చొప్పున యుద్ధనౌకలు ఉన్నాయి.