అమెరికాలోని న్యూయార్క్ నగర 112వ మేయర్‌గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ ప్రమాణం చేశారు. మాన్‌హట్టాన్‌లోని ఓ చారిత్రక సబ్‌వే స్టేషన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఖురాన్‌పై ప్రమాణం చేసి.. న్యూయార్క్‌లో తొలి ముస్లిం మేయర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. జోహ్రాన్ డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు.