ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్ 2025, ఆగస్టు 5న దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసారు. రెండు దేశాలు వ్యూహాత్మక సహకార ఒడంబడికతో సహా మొత్తం 9 ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
• ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు అయిదురోజుల అధికారిక పర్యటన కోసం ఆగస్టు 4న సతీసమేతంగా భారత్ విచ్చేశారు. తన పర్యటనలో భాగంగా ఆయన ఆగస్టు 5న రాష్ట్రపతి భవన్ సందర్శించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు స్వాగతం పలికారు. ఫిలిప్పీన్స్‌తో భారత దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో మార్కోస్ జూనియర్ దంపతుల అధికారిక పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.