ప్రముఖ ఆన్‌లైన్ నిఘంటువు వెబ్‌సైట్ ‘డిక్షనరీ.కామ్’ ఈ ఏడాది (2025) వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ‘67’ను ప్రకటించింది. ఈ సంఖ్యను కౌమారదశలోకి అడుగుపెట్టినవారు, జెన్‌ఆల్ఫా (2010-2025 మధ్య జన్మించినవారు)లు విపరీతంగా వినియోగిస్తున్నారు. 67ను కలిపి కాకుండా విడివిడి(ఆరు, ఏడు)గా చదవాలి.
అమెరికా ప్రముఖ ర్యాపర్ స్క్రిల్లా పాడిన ‘డ్రిల్ సాంగ్’ నుంచి ఈ పదం ఉద్భవించిందని భావిస్తున్నట్లు తెలిపింది.