చైనా స్ఫూర్తితో పాకిస్థాన్ కూడా అత్యాధునిక సాంకేతికతతో ఆర్మీ రాకెట్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ దళం నియంత్రణలో బాలిస్టిక్, హైపర్ సోనిక్, క్రూజ్ క్షిపణులు ఉంటాయి. 2025, ఆగస్టు 14న పాకిస్థాన్ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు.