తెలంగాణ అప్పులు, ఆస్తుల నిష్పత్తిలో తగ్గుదల నమోదైనట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌధరి 2025, ఆగస్టు 11న లోక్‌సభలో వెల్లడించారు. కొత్తరాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది (2014-15) అప్పులతో పోలిస్తే 19.45% మేర ఆస్తులు అధికంగా ఉండగా, 2023-24నాటికల్లా అది 18.42%కి తగ్గిపోయింది.
* రాష్ట్ర అప్పులు-ఆస్తుల నిష్పత్తి 2017-18 నుంచి 2020-21 మధ్యకాలంలో పెరిగినా.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. 2023-24 నాటికి తెలంగాణ అప్పు రూ.3.50 లక్షల కోట్లకు చేరింది. గత 10ఏళ్లలో నికరంగా ఆస్తులు 399% పెరగ్గా అప్పులు 403% పెరిగాయి.