గుంటూరులోని ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ.. 2025-26 విద్యా సంవత్సరానికి వర్సిటీ అనుబంధ కళాశాలల్లో మాస్టర్స్, పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. ఎంఎస్సీ (అగ్రికల్చర్)
2. ఎంబీఏ (ఏబీఎం)
3. ఎంటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్)
4. ఎంటెక్ (ఫుడ్ టెక్నాలజీ)
5. ఎంఎస్సీ (కమ్యూనిటీ సైన్స్)
మొత్తం సీట్ల సంఖ్య: 189.
వ్యవధి: రెండేళ్లు.
6. పీహెచ్‌డీ (అగ్రికల్చర్)
7. పీహెచ్‌డీ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్)
8. పీహెచ్‌డీ (కమ్యూనిటీ సైన్స్)
మొత్తం సీట్ల సంఖ్య: 45.
వ్యవధి: మూడేళ్లు.
కళాశాలనున్న ప్రాంతాలు: బాపట్ల, నైరా, మహానంది, తిరుపతి, పులివెందుల, గుంటూరు.
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 40 సంవత్సరాలు.
ప్రవేశ విధానం: పీజీ కోర్సులకు డిగ్రీ మార్కులు, ఏఐఈఈఏ (ఐకార్) స్కోరు; పీహెచ్‌డీ కోర్సులకు డిగ్రీ, పీజీ మార్కులు, ఏఐసీఈ (ఐకార్) స్కోరు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: ఓసీ, బీసీలకు రూ.1500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.750.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18-09-2025.
హార్డ్ కాపీ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 22-09-2025.
Website:https://angrau.ac.in/