నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్టు (సీమ్యాట్) ప్రకటన వెలువడింది. ఈ స్కోరుతో 2026-2027 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా గల మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు:
* కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్)-2026
అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: దరఖాస్తుకు వయసుతో సంబంధం లేదు.
దరఖాస్తు రుసుము: జనరల్ (యూఆర్) పురుషులకు రూ.2,500, మహిళలకు రూ.1,250. జనరల్- ఈడబ్ల్యూఎస్/ ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ ఓబీసీ-(ఎన్‌సీఎల్) పురుషులకు- రూ.1250, మహిళలకు రూ.1250. థర్డ్ జెండర్‌కు రూ.1250.
పరీక్ష విధానం: సీమ్యాట్‌లో 400 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు చొప్పున వంద ప్రశ్నలు వస్తాయి. ఇందులో ఒక్కో సెక్షన్ నుంచి 20 చొప్పున 5 విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్‌నెస్, ఇన్నొవేషన్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు. ఆన్‌లైన్ పరీక్ష వ్యవధి 3 గంటలు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ ఒక్కో మార్కు చొప్పున తగ్గిస్తారు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 17-11-2025.
ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 18-11-2025.
దరఖాస్తు సవరణ తేదీలు: 20-11-2025 నుంచి 22-11-2025 వరకు.
Website: https://cmat.nta.nic.in/