దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో వచ్చే ఏడాది ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్ 2026) పరీక్షకు షెడ్యూల్ వచ్చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈసారి ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణ బాధ్యత ఐఐటీ గువాహటి చేపట్టింది.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2026
వివరాలు:
గేట్ స్కోర్‌ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు సైతం పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుతం అండర్ గ్రాడ్యుయేట్, బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి సంవత్సరం చదువుతున్న డిగ్రీ విద్యార్థులూ(బీఏ, బీకాం, బీఎస్‌సీ) పోటీపడవచ్చు.
అర్హతలు: ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, కామర్స్, సైన్స్, ఆర్ట్స్, హ్యూమానిటీస్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అవకాశాలు:
గేట్‌కి అర్హత సాధించిన అభ్యర్థులు ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/సైన్స్/కామర్స్/కళలు/హ్యూమానిటీస్ లో విద్యా మంత్రిత్వ శాఖ (MoE), ఇతర ప్రభుత్వ సంస్థల మద్దతు ఉన్న సంస్థలలో విభాగాలలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌లు, డైరెక్ట్ డాక్టోరల్ ప్రోగ్రామ్, డాక్టోరల్ ప్రోగ్రామ్‌లకు ఆర్థిక సహాయంతో ప్రవేశం పొందవచ్చు. ఎంఓఈ స్కాలర్‌షిప్ లేకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి కొన్ని కళాశాలలు సంస్థలు గేట్ స్కోర్‌ను కూడా ఉపయోగిస్తున్నాయి.
* వయసు: అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి లేదు.
* దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
* ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 25-08-2025.
* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్/ దరఖాస్తు ప్రక్రియ ముగింపు తేదీ: 25-09-2025.
* ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేదీ: 06-10-2025.
* పరీక్ష తేదీలు: వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 8, 14, 15
* ఫలితాలు విడుదల: 19.03.2026.
Website: https://gate2026.iitg.ac.in/