హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ, ప్రొఫెసర్ జి.రామ్‌రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ 2025-26 విద్యా సంవత్సరానికి దూర విద్య విధానంలో ఎంబీఏ, ఎంసీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
1. ఎంబీఏ
2. ఎంసీఏ
కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.
అర్హత: ఎంబీఏ కోర్సుకు ఏదైనా గ్రాడ్యుయేట్; ఎంసీఏ కోర్సుకు గణితం సబ్జెక్టుగా డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు. టీజీ/ ఐసెట్-2025లో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో నేరుగా ప్రవేశం పొందవచ్చు.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.900.
పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. సెక్షన్-ఏ అనలిటికల్ ఎబిలిటీ 35 మార్కులు; సెక్షన్-బి మ్యాథమెటికల్ ఎబిలిటీ 40 మార్కులు; సెక్షన్-సి కమ్యూనికేషన్ ఎబిలిటీ 25 మార్కులు.
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 15.09.2025
* దరఖాస్తుకు చివరి తేదీ: 02-09-2025.
* రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: 05-09-2025.
* ప్రవేశ పరీక్ష తేదీ: 07-09-2025.
Website: http://www.oucde.net/