నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగాలు

నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వ వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) పరిధిలోని నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల/ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వివిధ బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 62

వివరాలు:

1. ప్రొఫెసర్ - 01

2. అసోసియేట్ ప్రొఫెసర్ - 15

3. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 32 (స్పెసిఫిక్ విభాగాలతో కలిపి)

4. ట్యూటర్ - 14

విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, రేడియాలజీ, ఓబీజీ, డీవీఎల్, జనరల్ మెడిసిన్ తదితర విభాగాలు.

అర్హతలు: సంబంధిత విభాగంలో ఎండీ (MD)/ ఎంఎస్ (MS)/ డీఎన్‌బీ (DNB) లేదా ఎన్ఎంసీ (NMC) నిబంధనల ప్రకారం అర్హత కలిగి ఉండాలి. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఎంపికైన వారం రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.

వయసు: దరఖాస్తుదారులు 69 ఏళ్ల లోపు వారై ఉండాలి.

వేతనం: ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,90,000, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,50,000, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1,25,000, ట్యూటర్‌కు రూ.55,000.

ఇంటర్వ్యూ వివరాలు:\

తేదీ: మార్చి 16, 2026.

సమయం: ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 02.00 గంటల వరకు.

వేదిక: ప్రిన్సిపాల్ ఛాంబర్, ప్రభుత్వ వైద్య కళాశాల (GMC), నల్గొండ.

ముఖ్య గమనిక: అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను వెరిఫికేషన్ కోసం వెంట తీసుకురావాలి. ఎంపికైన వారు వారం రోజుల్లోగా విధుల్లో చేరాల్సి ఉంటుంది.

Website:https://nalgonda.telangana.gov.in/notice_category/recruitment/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram