సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌ 2025

సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌ 2025

తల్లిదండ్రులకు ఏకైక బాలికా సంతానంగా ఉన్న ప్రతిభ కలిగిన విద్యార్థినుల కోసం సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ఉపకార వేతనాన్ని ఏటా అందిస్తోంది. ఇందుకు సంబంధించి సీబీఎస్‌ఈ- సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌ 2025 ప్రకటన వెలువడింది. సీబీఎస్‌ఈ పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థినుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

సీబీఎస్‌ఈ- సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌ 2025

అర్హతలు: విద్యార్థిని తల్లిదండ్రులకు ఏకైక కూతురై ఉండాలి. విద్యార్థిని సీబీఎస్‌ఈలో పదోతరగతి ఉత్తీర్ణురాలై, సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలో పదకొండు తరగతి, పన్నెండో తరగతి చదువుతూ ఉండాలి. పదో తరగతి పరీక్షలో కనీసం 70శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థిని ట్యూషన్‌ ఫీజు నెలకు రూ.2500, సీబీఎస్‌ఈ 11, 12 తరగతులకు రూ.3,000 మించకూడదు.

సీబీఎస్‌ఈ బోర్డులో విద్యనభ్యసిస్తున్న ఎన్నారై విద్యార్థినులూ ఈ అవార్డుకు అర్హులే. వీరి ట్యూషన్ ఫీజు నెలకు రూ.6వేలు మించకూడద్దు.

ఈ స్కాలర్‌షిప్‌నకు ఇప్పటికే ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి తర్వాత మళ్లీ రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.8లక్షల కన్నా తక్కువ ఉండాలి.

ఈ దరఖాస్తుల్ని సంబంధిత పాఠశాలలు అక్టోబర్‌ 30 నాటికి వెరిఫికేషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.

స్కాలర్‌షిప్‌ ఎంతంటే..: ఉపకారవేతనానికి ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి తర్వాత ప్రతి సంవత్సరం రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్‌ చేయించుకోవాలంటే, విద్యార్థిని కనీసం 70శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థినులకు రెండేళ్ల పాటు నెలకు రూ.1000 చొప్పున రెండేళ్ల పాటు అందిస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 20-11-2025.

Website:https://www.cbse.gov.in/cbsenew/scholar.html 

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram