కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థకు చెందిన ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఈసీఎల్) 2025-26 సంవత్సరానికి ఐటీఐ అప్రెంటిస్‌ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (ఎన్‌ఏటీఎస్) పోర్టల్ ద్వారా నమోదు అయి ఉండాలి.
మొత్తం పోస్టుల సంఖ్య: 280
వివరాలు:
ట్రేడుల వారీగా ఖాళీలు:
ఫిట్టర్: 120
ఎలక్ట్రీషియన్: 120
సీఓపీఏ: 20
వెల్డర్: 20
అర్హతలు: ఐటీఐ ఉత్తీర్ణత. ఎన్‌ఏటీఎస్ పోర్టల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
స్టైపెండ్: నెలకు ఎలక్ట్రీషియన్, ఫిట్టర్‌కు రూ.7,700; వెల్డర్, సీఓపీఏకు రూ.7000.
ఎంపిక విధానం: విద్యార్హతల మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ది ఆఫీస్ ఆఫ్ ది జనరల్ మేనేజర్, హెచ్‌ఆర్‌డీ, డిషెర్‌గర్, పశ్చిమ్ బుడ్వన్, పశ్చిమబెంగాల్ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు చివరి తేదీ: 26.09.2025.
Website:https://www.easterncoal.nic.in/