భారత నౌకాదళంలో అగ్నివీర్ పోస్టుల నియామకానికి ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 01/2027, 02/2027 బ్యాచ్‌లకు అగ్నివీర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్) పోస్టుల భర్తీకి అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్(ఐనెట్) ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
వివరాలు:
అగ్నివీర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్- ఎస్‌ఎస్‌ఆర్)
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో గుర్తింపు పొందిన బోర్డు నుంచి గణితం, ఫిజిక్స్ సబ్జెక్టులతో 10+2, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి విభాగాల్లో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా లేదా ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో రెండేళ్ల వొకేషనల్ కోర్సు (50% మార్కులతో) చేసిన వారు కూడా అర్హులు. అభ్యర్థులు కేవలం అవివాహితులు అయి ఉండాలి.
వయోపరిమితి: 01/2027 బ్యాచ్: 01 డిసెంబర్ 2004 నుంచి 31 మే 2009 మధ్య జన్మించి ఉండాలి.
02/2027 బ్యాచ్: 01 మే 2005 నుంచి 31 అక్టోబర్ 2009 మధ్య జన్మించి ఉండాలి.
కనిష్ఠ ఎత్తు ప్రమాణాలు: పురుషులు, మహిళలు కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్, స్టేజ్-1 (ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్), స్టేజ్-2 (రాత పరీక్ష, శారీరక దార్ఢ్య పరీక్ష- పీఎఫ్‌టీ), వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
శిక్షణ: అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్‌ఎస్ చిల్కాలో 01/2027 బ్యాచ్‌కుకు డిసెంబర్ 2026లో, 02/2027 బ్యాచ్‌కు మే 2027లో కోర్సు శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
జీత భత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం నెలకు రూ.30,000 ప్యాకేజీ ఉంటుంది. దీనికి ఏటా నిర్ణీత ఇంక్రిమెంట్ ఉంటుంది.
అభ్యర్థికి చేతికి 70% జీతం అందుతుంది, మిగిలిన 30% అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు వెళ్తుంది. నాలుగు ఏళ్ల తర్వాత 'సేవా నిధి' కింద ప్రభుత్వం ఇచ్చే వాటాతో కలిపి మొత్తం సుమారు రూ.10.04 లక్షలు అందుతాయి.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: ప్రశ్నపత్రం హిందీ/ ఇంగ్లిష్ భాషల్లో మొత్తం 50 బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఒక్కొక్కటి 1 మార్కు చొప్పున 100 మార్కులను కలిగి ఉంటుంది. ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్ నాలుగు విభాగాల్లో నుంచి ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి ఒక గంట. పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
స్టేజ్ II: ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT), రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. పురుష, మహిళా అభ్యర్థుల కనీస ఎత్తు 157 సెం.మీ ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.550.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 14.03.2026.
ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 06.04.2026.
స్టేజ్1 ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్: మే 2026లో ఉండవచ్చు.
Website: https://www.joinindiannavy.gov.in/
Link copied to clipboard!
ఇండియన్ నేవీ ఎస్‌ఎస్‌ఆర్ (మెడికల్) పోస్టులు
ఇండియన్ నేవీలో అగ్నివీర్ (ఎస్‌ఎస్‌ఆర్) పోస్టులు
ఐఆర్ఈడీఏలో మేనేజీరియల్ ఉద్యోగాలు
భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు (స్పోర్ట్స్) ఉద్యోగాలు
రైట్స్ లిమిటెడ్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగాలు
యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2026
ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌లో ట్రెయినీ ఇంజినీర్ ఉద్యోగాలు
ఐఐటీఎమ్ పూణెలో రిసెర్చ్ ఫెలో ఉద్యోగాలు
హెచ్ఏఎల్ హైదరాబాద్‌లో విజిటింగ్ డాక్టర్ పోస్టులు
ఎయిమ్స్ మదురైలో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
నీట్-ఎండీఎస్ 2026 ప్రవేశాలు
ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2026
ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులు
నవయుగ్ స్కూల్ సరోజినీ నగర్ ప్రవేశ పరీక్ష (ఎన్‌ఎస్‌ఎస్‌ఎన్‌ఈటీ)-2026
ఐఐటీ మద్రాస్‌లో బీఎస్సీ ప్రవేశాలు
టీజీ ఈఏపీసెట్-2026 నోటిఫికేషన్
తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ప్రవేశాలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్-2026 ప్రవేశాలు
సిపెట్ అడ్మిషన్ టెస్ట్-2025
సౌత్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్ పోర్ట్స్ అథారిటీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు
రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులు
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
వెస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్
కోకో సాగులో ఏపీ టాప్
మారిటైం షిప్ బిల్డింగ్ సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్
రాష్ట్ర ఆదాయం రూ.1,59,501 కోట్లు
‘ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2023-24’
ఏవీఎస్ఎస్ఎన్ రాజు
హెవీ మినరల్స్
పంచాయతీల పునర్ వర్గీకరణ
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్
జనాభా నిర్వహణ విధానం
ఆర్థిక ఆరోగ్య సూచీలో తెలంగాణకు ఏడోస్థానం
గద్దర్ సినీ అవార్డులు-2025
ఉన్నత విద్యలో ఎన్ఈపీ-2020 అమలు
జాతీయ ప్రాధాన్య స్మారకంగా పాలంపేట్ గొల్లలగుడి
తెలంగాణ గవర్నర్‌గా శివ్‌ప్రతాప్ శుక్లా
కరీంనగర్ డీసీసీబీకి ప్రథమ స్థానం
సహకార క్లబ్‌లు
ప్రమాదకరస్థాయిలో ఎరువుల వాడకం
ముగిసిన పత్తి సీజన్
ప్రతిభా ‘పురస్కారం’
ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహం
సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ పరీక్ష విజయవంతం
సి-నోబార్
సూర్యరశ్మి నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి
ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ పరీక్ష
దేశీయంగా అధునాతన టార్పెడోల ఉత్పత్తి
‘ఐఎన్‌ఎస్ విక్రాంత్’ రికార్డు
‘ఐఎన్‌ఎస్ అంజదిప్’ యుద్ధనౌక ప్రారంభం
గగనతల రక్షణ క్షిపణి పరీక్షలు విజయవంతం
‘వాయుశక్తి’