భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు (స్పోర్ట్స్‌) ఉద్యోగాలు

భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు (స్పోర్ట్స్‌) ఉద్యోగాలు

 భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా క్రీడల విభాగంలో అగ్నివీర్‌ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్‌ విడుదల చేసింది. అగ్నివీర్ వాయు (స్పోర్ట్స్‌) (02/ 2026) పోస్టుల భర్తీకి ఐఏఎఫ్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

భారత వాయుసేన- అగ్నివీర్ వాయు (స్పోర్ట్స్‌) ఇన్‌టేక్‌ 02/2026

క్రీడాంశాలు: అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, చెస్‌, క్రికెట్, సైక్లింగ్, ఫుట్‌బాల్, గోల్ఫ్‌, లాన్‌ టెన్నిస్‌, హ్యాండ్‌బాల్, స్విమ్మింగ్/ డైవింగ్, షూటింగ్, వాటర్ పోలో, రెజ్లింగ్, సైకిల్ పోలో, జిమ్నాస్టిక్స్, హాకీ, స్క్వాష్, కబడ్డీ, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, ఉషు.

అర్హత: కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్/ 10+2 (మ్యాథ్స్‌, ఫిజిక్స్, ఇంగ్లిష్‌) లేదా ఏదైనా స్ట్రీమ్/ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్/ 10+2/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. లేదా ఇంజినీరింగ్‌లో డిప్లొమా కోర్సు (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ). నిర్దిష్ట శారీరక దారుఢ్య/ వైద్య ప్రమాణాలతో పాటు స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్‌ తప్పనిసరి.

ఎత్తు: 152 సెం.మీ. కనీస ఎత్తు ఉండాలి.

వయోపరిమితి: 02-07-2005 నుంచి 02-01-2009 మధ్య జన్మించిన అభ్యర్థులు అర్హులు.

ఎంపిక ప్రక్రియ: సెలెక్షన్‌ టెస్ట్‌, స్పోర్ట్స్ స్కిల్ ట్రయల్స్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.100.

ముఖ్య తేదీలు..

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 23.03.2026.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 29.03.2026.

రిక్రూట్‌మెంట్ ట్రయల్స్ షెడ్యూల్: 08 నుంచి 10-04-2026 వరకు.

ట్రయల్స్ వేదిక: తేజస్ క్యాంప్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ న్యూదిల్లీ, లోక్ కల్యాణ్ మార్గ్, న్యూదిల్లీ.

Website: https://agnipathvayu.cdac.in/AV/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram