ఎన్‌బీసీసీలో మేనేజీరియల్‌ ఉద్యోగాలు

ఎన్‌బీసీసీలో మేనేజీరియల్‌ ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన దిల్లీలోని నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ (ఎన్‌బీసీసీ) లిమిటెడ్‌ వివిధ విభాగాల్లో మెనేజీరియల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 60

వివరాలు:

జనరల్‌ మేనేజర్‌- 01

మేనేజర్‌- 02

డిప్యూటీ మేనేజర్‌- 01

అసిస్టెంట్‌ మేనేజర్‌- 08

సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఎగ్జిక్యూటివ్‌- 10

గ్రాడ్యుయేట్‌ అసిస్టెంట్- 02

జూనియర్‌ ఇంజినీర్‌- 35

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 60శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ/ పీజీ, సీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు జనరల్‌ మేనేజర్‌కు రూ.90,000-2,40,000;  గ్రాడ్యుయేట్‌ అసిస్టెంట్‌కు రూ.30,000- రూ.1,20,000; జూనియర్‌ ఇంజినీర్‌కు రూ.27,000; మేనేజర్‌కు రూ.60,000- రూ.1,80,000; డిప్యూటీ మేనేజర్‌కు రూ.50,000- రూ.1,60,000; అసిస్టెంట్‌ మేనేజర్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఎగ్జిక్యూటివ్‌కు రూ.40,000- రూ.1,40,000.

వయోపరిమితి: చివరి తేదీ నాటికి జనరల్‌ మేనేజర్‌కు 54 ఏళ్లు; అసిస్టెంట్‌ మేనేజర్‌, గ్రాడ్యుయేట్‌ అసిస్టెంట్, జూనియర్‌ ఇంజినీర్‌కు 28 ఏళ్లు; మేనేజర్‌కు 37 ఏళ్లు; డిప్యూటీ మేనేజర్‌కు 33 ఏళ్లు; అసిస్టెంట్‌ మేనేజర్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఎగ్జిక్యూటివ్‌కు 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: సీబీటీ ఆధారిత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ  తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.1000; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 05.04.2026.

Website:https://nbccindia.in/

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram