సమీర్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు

సమీర్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు

భారత ప్రభుత్వరంగ సంస్థ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ముంబయిలోని సొసైటీ ఫర్ అప్లైడ్‌ మైక్రోవేవ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ (సమీర్‌) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ సైంటిఫిక్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడదుల చేసింది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 147.

వివరాలు:

ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: 71

ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 05

ప్రాజెక్ట్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌: 34

ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఏ అండ్‌ బి): 37

విభాగాలు: ఆర్‌ఎఫ్‌ అండ్‌ ఎండబ్ల్యూ, ఎలక్ట్రానిక్స్‌, సీఎస్‌/ఐటీ, సేఫ్టీ, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రికల్‌ హెచ్‌వీఏసీ, మెకానికల్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫిజిక్స్‌, అట్మాస్ఫియరిక్‌ సైన్స్‌, మెడికల్‌, ఫిట్టర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి ఐటీఐ సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగాల్లో డిప్లొమా బీఎస్సీ, బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్, ఎంఎస్సీ, ఉత్తీర్ణత ఉండాలి.

జీతం: నెలకు ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులకు రూ.34,000; ప్రాజెక్ట్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ రూ.23,500; ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-ఏకు రూ.21,000; ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌  -బికు రూ.23,500.

వయోపరిమితి: ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులకు 28 ఏళ్లు; ప్రాజెక్ట్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-ఏకు 25 ఏళ్లు; ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ 30ఏళ్లు మించకూడదు. 

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి, రాత పరీక్ష/ స్కిల్‌/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 25-01-2026.

ఆన్‌లైన్‌ టెస్ట్‌: 01.02.2026.

Website:https://recruitment.sameer.gov.in/

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram