ప్రభుత్వ రంగ సంస్థ- హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన హెచ్‌ఎల్‌ఎల్ ఇన్‌ఫ్రాటెక్ సర్వీసెస్ లిమిటెడ్.. దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాలు/ ప్రాజెక్టుల్లో రెగ్యులర్/ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 31
వివరాలు:
1. డిప్యూటీ మేనేజర్: 19
2. అసిస్టెంట్ మేనేజర్: 12
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్, సీఏ/ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, బీఫార్మ్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.30,000- రూ.1,20,000; డిప్యూటీ మేనేజర్‌కు రూ.40,000- 1,40,000.
వయోపరిమితి: 31.08.2025 నాటికి అసిస్టెంట్ మేనేజర్‌కు 37 ఏళ్లు; డిప్యూటీ మేనేజర్‌కు 40ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 18.09.2025.
Website:https://www.lifecarehll.com/