భారతదేశంలో నవరత్న పబ్లిక్ సెక్టార్ యూనిట్ అయిన షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌సీఐ) నుంచి అసిస్టెంట్ మేనేజర్ (E2), ఎగ్జిక్యూటివ్ (E0) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం పోస్టులు: 75
వివరాలు:
1. అసిస్టెంట్ మేనేజర్ (E2): 55 పోస్టులు
మేనేజ్‌మెంట్- 20
ఫైనాన్స్- 8
హెచ్‌ఆర్/పర్సనల్- 4
లా- 2
ఇంజినీరింగ్ (సివిల్)- 2
ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్)- 2
ఇంజినీరింగ్ (మెకానికల్)- 8
ఇంజినీరింగ్ (IT)- 3
ఫైర్ & సెక్యూరిటీ- 2
నావల్ ఆర్కిటెక్ట్- 2
కంపెనీ సెక్రటరీ- 2
2. ఎగ్జిక్యూటివ్ (E0)- 20 పోస్టులు
ఫైనాన్స్- 10
హైచ్‌ఆర్/పర్సనల్- 6
మాస్ కమ్యూనికేషన్- 2
హిందీ- 2
అర్హత: కనీసం 60% మార్కులతో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు డిగ్రీ, ఎంబీఏ, ఎంఎంఎస్, సీఏ, సీఎస్, పీజీ, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు బీబీఏ, బీఎంఎస్, డిగ్రీ లేదా మాస్టర్స్ (హిందీ) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగాభవం ఉండాలి.
జీతం: నెలకు అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.50,000- 1,60,000; ఎగ్జిక్యూటివ్‌కు రూ.30,000- రూ.1,20,000.
వయోపరిమితి: 01.08.2025 నాటికి 27 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు: యూఆర్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌లకు రూ.500. ఎస్సీ/ఎస్టీ/ఈఎస్ఎం/దివ్యాంగ అభ్యర్థులకు రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 27-09-2025.