గుజరాత్‌లోని సీఎస్‌ఐఆర్- సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్‌ఎంసీఆర్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
వివరాలు:
1. ప్రాజెక్ట్ అసోసియేట్-I: 02
2. ప్రాజెక్ట్ అసోసియేట్-II: 01
3. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: 01
- అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
- కనీస వయసు: సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుకు 40 సంవత్సరాలు, ప్రాజెక్ట్ అసోసియేట్‌కు 35 సంవత్సరాలు మించకూడదు.
- జీతం: నెలకు ప్రాజెక్ట్ అసోసియేట్-Iకు సీఎస్‌ఐఆర్ యూజీసీ/ఐసీఏఆర్/ఐసీఎంఆర్ నెట్ క్వాలిఫైడ్ అభ్యర్థులకు రూ.31,000 (ఇతరులకు రూ.25,000), ప్రాజెక్ట్ అసోసియేట్-IIకు రూ.20,000; సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.42,000.
- ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
- ఇంటర్వ్యూ తేదీ: 18.09.2025.
- వేదిక: సీఎస్‌ఐఆర్-సీఎస్‌ఎంసీఆర్‌ఐ జీబీ మార్గ్, భావ్‌నగర్.
Website: https://www.csmcri.res.in/