ఏపీపీఎస్సీ - లెక్చరర్, సీనియర్ లెక్చరర్ ఉద్యోగాలు

ఏపీపీఎస్సీ - లెక్చరర్, సీనియర్ లెక్చరర్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ), ఏపీ పాఠశాల విద్యాశాఖ సర్వీసులో ఖాళీగా ఉన్న డైట్ సీనియర్ లెక్చరర్, ఎస్‌సీఈఆర్‌టీ లెక్చరర్, డైట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య - 160

వివరాలు:

  1. సీనియర్ లెక్చరర్ (డైట్) - 46

  2. లెక్చరర్ (ఎస్‌సీఈఆర్‌టీ) - 10

  3. లెక్చరర్ (డైట్) - 104

అర్హత: సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు విద్యారంగంలో వృత్తిపరమైన అర్హతను కలిగి ఉండాలి. లెక్చరర్ పోస్టులకు కావలసిన కచ్చితమైన విద్యా అర్హతలు, వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నిర్ణయిస్తారు.

జీతం: నెలకు సీనియర్ లెక్చరర్ (డైట్) పోస్టుకు రూ. 61,960 - రూ. 1,51,370. లెక్చరర్ (ఎస్‌సీఈఆర్‌టీ) పోస్టుకు రూ.57,700 - రూ.1,82,400. లెక్చరర్ (డైట్) పోస్టుకు రూ.54,060 - రూ.1,40,540.

గరిష్ఠ వయోపరిమితి: 2026 జులై 1 నాటికి 18 నుంచి 44 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026 నవంబరు 18

దరఖాస్తు చివరి తేదీ: 2026 డిసెంబరు 8

Website:https://psc.ap.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram