ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (ఏఎఫ్‌ఎంఎస్) షార్ట్ సర్వీస్ కమిషన్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన వైద్య అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
మెడికల్ ఆఫీసర్: 30 పోస్టులు
అర్హత: డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (DCI) గుర్తింపు పొందిన కళాశాల/విశ్వవిద్యాలయం నుంచి బీడీఎస్/ ఎండీఎస్ ఉత్తీర్ణత, 2025 జూన్ 30 నాటికి ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాలి. స్టేట్ డెంటల్ కౌన్సిల్/డీసీఐ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. నీట్ (ఎండీఎస్) 2025 లో హాజరై ఉండాలి.
వయోపరిమితి: 31-12-2025 నాటికి 45 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు రుసుము: రూ.200.
ఎంపిక విధానం: నీట్ (ఎండీఎస్) మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, ఫిజికల్, మెడికల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17-09-2025.
Website: http://www.join.afms.gov.in./