ఆర్‌ఎల్‌డీఏలో ఇంజినీర్‌ ఉద్యోగాలు

ఆర్‌ఎల్‌డీఏలో ఇంజినీర్‌ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్ ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఆర్‌ఎల్‌డీఏ), దేశవ్యాప్తంగా ఉన్న తమ ప్రాజెక్టుల కోసం ఒప్పంద ప్రాతిపదికన సైట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

సైట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్/సివిల్‌): 40

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో (ఎస్సీ/ఎస్టసీ అభ్యర్థులకు 50 శాతం) సివిల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: మే 22, 2026 నాటికి గరిష్ఠంగా 45 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

ఎంపిక విధానం: అభ్యర్థుల విద్యార్హత మార్కులు, పని అనుభవం, చివరిగా అందుకున్న జీతం & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ప్రారంభంలో ఒక ఏడాది కాలానికి ఒప్పందం ఉంటుంది, పనితీరును బట్టి దీనిని పొడిగించే అవకాశం ఉంది.

వేతనం: నెలకు రూ.76,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 మే 22.

Website: https://rlda.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,298

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram