ఐఐటీ గువహటిలో ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగాలు

ఐఐటీ గువహటిలో ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగాలు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గువహటి, రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెక్షన్‌లోని 'సెంటర్ ఫర్ లింగ్విస్టిక్ సైన్స్ అండ్‌ టెక్నాలజీ' (సీఎల్‌ఎస్‌టీ) విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

వివరాలు:

1. ప్రాజెక్ట్ మేనేజర్ - 01  

2. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ - 01  

3. అసోసియేట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ - 01  

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో  ఎంఈ/ఎంటెక్‌/ఎంఎస్‌/పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు నెట్‌/గేట్‌ లో అర్హత సాధించి ఉండాలి.

వేతనం: నెలకుప్రాజెక్ట్ మేనేజర్‌కు కు రూ. 1,01,550. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ. 72,050.  అసోసియేట్ ప్రాజెక్ట్ ఇంజనీర్‌కు రూ. 54,350.  

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

చివరి తేదీ: 2026, మే 15

Website:https://iitg.ac.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram