జాతీయం

ఉడాన్‌ కింద 649 విమాన మార్గాలు

Published: October 21, 2025

ప్రాంతీయ విమాన అనుసంధానత పథకం ఉడాన్‌ కింద మొత్తం 649 మార్గాలు నిర్వహణలోకి వచ్చాయని ప్రభుత్వం 2025, అక్టోబరు 21న వెల్లడించింది. ఇందులో 15 హెలీపోర్ట్‌లు, 2 వాటర్‌ ఏరోడ్రోమ్‌లు కూడా ఉన్నాయి....

8.82 లక్షల ఎగ్జిక్యూషన్‌ పిటిషన్లు పెండింగ్‌

Published: October 20, 2025

దేశవ్యాప్తంగా ఏకంగా 8.82 లక్షల ఎగ్జిక్యూషన్‌ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ పరిస్థితి ఆందోళనకరమని, అవాంఛనీయమని వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని కోరుతూ డిక్రీ హోల్డర్‌లు ...

హిందుస్థాన్‌ షిప్‌యార్డుకు మినీరత్న హోదా

Published: October 14, 2025

దేశంలోనే తొలి నౌకా నిర్మాణ పరిశ్రమగా విశాఖపట్నం తీరాన ఏర్పాటయిన ‘హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌’కు మినీరత్న హోదా దక్కింది. డిఫెన్స్‌ శాఖకు చెందిన రక్షణ ఉత్పత్తుల విభాగం ఈ మేరకు సంస్థ సీఎండీకి 2025, అక్టోబరు 14న లేఖ పంపింది....

పీఎం గతిశక్తి పోర్టల్‌

Published: October 13, 2025

ప్రధానమంత్రి గతిశక్తి పోర్టల్‌ను ప్రభుత్వం 2025, అక్టోబరు 13న ప్రారంభించింది. ప్రైవేట్‌ సంస్థలు వినియోగదారుల ఇంటి వద్దకే సకాలంలో సేవలను అందించేలా, మౌలిక సదుపాయాల ఆధారిత అప్లికేషన్‌లను అభివృద్ధి చేయడంలో ప్రవేట్‌ రంగానికి సహాయపడేలా దీన్ని తీసుకొచ్చారు....

16వ ఆర్థిక సంఘం పదవీ కాలం పొడిగింపు

Published: October 11, 2025

నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ఛైర్మన్‌ అరవింద్‌ పనగడియా నేతృత్వంలో ఏర్పాటైన 16వ ఆర్థిక సంఘం పదవీకాలాన్ని నెలరోజులపాటు పొడిగించేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2025, అక్టోబరు 11న ఆమోదం తెలిపారు. ...

పీఎం ధనధాన్య కృషి యోజన, పప్పుధాన్యాల స్వావలంబన మిషన్‌ పథకాలు

Published: October 11, 2025

దిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన మండలి ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోదీ 2025, అక్టోబరు 11న పీఎం ధనధాన్య కృషి యోజన, పప్పుధాన్యాల స్వావలంబన మిషన్‌ పథకాలను ప్రారంభించి ప్రసంగించారు....

భారత సైన్యానికి ‘విద్యుత్‌ రక్షక్‌’పై పేటెంట్‌

Published: October 10, 2025

భారత సైన్యానికి చెందిన సమీకృత జనరేటింగ్‌ మానిటరింగ్, ప్రొటెక్షన్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ‘విద్యుత్‌ రక్షక్‌’కు పేటెంట్‌ హక్కు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇటీవల దీన్ని మేజర్‌ రాజ్‌ప్రసాద్‌ ఆర్‌ఎస్‌ అభివృద్ధి చేశారు. ...

టీఎస్‌టీఎల్‌కు విశిష్ట గుర్తింపు

Published: October 6, 2025

ఐఐటీ మద్రాస్‌ ప్రవర్తక్‌ టెక్నాలజీస్‌ ఫౌండేషన్‌లో నడుస్తున్న టెలికాం సెక్యూరిటీ టెస్టింగ్‌ ల్యాబ్‌ (టీఎస్‌టీఎల్‌)కు విశిష్ట గుర్తింపు లభించింది. దేశంలో 5జీ నెట్వర్క్, యాక్సెస్, మొబిలిటీ మేనేజ్‌మెంట్ ఫంక్షన్‌ (ఏఎంఎఫ్‌), 5జీ గ్రూప్‌-1 పరికరాలను పరీక్షించడానికి టీఎస్‌టీఎల్‌ను అధికారిక ప్రయోగశాలగా కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్‌ విభాగం ధ్రువీకరించింది. ...

పెరిగిన ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం

Published: October 6, 2025

2025లో ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం 6.51 లక్షల హెక్టార్ల మేర పెరిగినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ అక్టోబరు 6న వెల్లడించింది. 2024లో దేశవ్యాప్తంగా 1,114.95 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కాగా.. ఈసారి అది 1,121.46 లక్షల హెక్టార్లకు పెరిగినట్లు తెలిపింది....

పీఎం సేతు

Published: October 4, 2025

పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలకు అనుగుణంగా ఐటీఐల నెట్‌వర్క్‌ను తీర్చిదిద్దడానికి రూ.60 వేల కోట్లతో పీఎం సేతు (ప్రధాన మంత్రి స్కిల్లింగ్‌ అండ్‌ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ త్రూ అప్‌గ్రేడెడ్‌ ఐటీఐస్‌) పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ 2025, అక్టోబరు 4న ప్రకటించారు....

‘స్వస్థ నారి, సశక్త పరివార్‌’

Published: October 4, 2025

‘స్వస్థ నారి, సశక్త పరివార్‌’ కార్యక్రమం కింద దేశమంతటా 6.5 కోట్ల మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా 2025, అక్టోబరు 4న తెలిపారు. ...

ఆన్‌లైన్‌ గేమింగ్‌ అథారిటీ

Published: October 3, 2025

ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ అథారిటీ (ఏజీఏ)ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇ-స్పోర్ట్స్, డిజిటల్‌ సోషియల్‌ గేమ్స్, రియల్‌ మనీ గేమ్‌ (ఆర్‌ఎమ్‌జీ) నిషేధం తదితరాలను ఇది పర్యవేక్షిస్తుంది....

ఆర్‌ఎస్‌ఎస్‌ శాతాబ్ధి ఉత్సవాలు

Published: October 1, 2025

దిల్లీలోని బీఆర్‌ అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ కేంద్రంలో 2025, అక్టోబరు 1న జరిగిన ఆరెస్సెస్‌ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు....

అర్బన్‌ ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం

Published: October 1, 2025

ప్రకృతి వైపరీత్యాలతో ప్రభావితమైన 9 రాష్ట్రాలకు రూ.4,645.60 కోట్ల విలువైన రికవరీ, రీకన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసింది....

కేంద్ర మంత్రిమండలి నిర్ణయాలు

Published: October 1, 2025

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 2025, అక్టోబరు 1న దిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం రూ.1,20,107 కోట్ల విలువైన పలు కీలక నిర్ణయాలు తీసుకొంది....

స్పీడ్‌ పోస్టులో రిజిస్టర్‌ పోస్టు విలీనం

Published: September 28, 2025

బ్రిటిష్‌ కాలం నుంచి అమల్లో ఉన్న రిజిస్టర్‌ పోస్టు విధానాన్ని తపాలా శాఖ స్పీడ్‌ పోస్టులో విలీనం చేసింది. వాల్యూయాడెడ్‌ సర్వీసుగా స్పీడ్‌ పోస్టు కిందే ఇది అందుబాటులో ఉంటుంది....

తాజ్‌మహల్‌

Published: September 27, 2025

2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశంలో అత్యధికులు సందర్శించిన పర్యాటక ప్రాంతంగా ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ నిలిచింది....

సీఆర్‌పీఎఫ్, ఐకామ్, కారకాల్‌ మధ్య ఒప్పందం

Published: September 23, 2025

కేంద్ర సాయుధ బలగాల సంస్థ సీఆర్‌పీఎఫ్‌ (సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌)కు సీఎస్‌ఆర్‌-338 స్నైపర్‌ రైఫిల్స్‌ను మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (ఎంఈఐఎల్‌) గ్రూపు సంస్థ ఐకామ్‌ సరఫరా చేయనుంది. ...

ఆస్కార్‌కి ‘హోమ్‌బౌండ్‌’

Published: September 19, 2025

‘హోమ్‌బౌండ్‌’ చిత్రం భారతదేశం తరఫున 98వ ఆస్కార్‌ అకాడమీ పురస్కారాల్లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ విభాగంలో ఎంపికైంది....

2024-25లో రూ.2.10 లక్షల కోట్ల కాంట్రాక్టులు

Published: September 19, 2025

2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర రక్షణ శాఖ రూ.2.10 లక్షల కోట్ల విలువైన 195 కాంట్రాక్టులను దేశీయ కంపెనీలకు ఇచ్చింది....

ఈసీ జాబితా నుంచి పార్టీల తొలగింపు

Published: September 19, 2025

ఎన్నికల సంఘం (ఈసీ) వద్ద పేరు నమోదు చేసుకుని గుర్తింపు పొందని 474 పార్టీలపై వేటుపడింది....

‘స్వస్థ్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌’

Published: September 17, 2025

దేశంలోని మహిళలందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ‘స్వస్థ్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌’ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2025, సెప్టెంబరు 17న మధ్యప్రదేశ్‌లో ప్రారంభించారు. ...

బీమా సుగమ్‌ అధికారిక వెబ్‌సైట్‌

Published: September 17, 2025

పాలసీదారులు బీమా పాలసీలను సులభంగా కొనుగోలు చేసేందుకు వీలుగా బీమా సుగమ్‌ అధికారిక వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చింది. 2025, సెప్టెంబరు 17న హైదరాబాద్‌లో ఐఆర్‌డీఏఐ ఛైర్మన్‌ అజయ్‌ సేథ్‌ దీన్ని ప్రారంభించారు....

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram