నివేదికలు - సర్వేలు

కేంద్ర గణాంకాల శాఖ సర్వే నివేదిక

Published: October 22, 2025

తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యధికంగా అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన సర్వే నివేదిక వెల్లడించింది. ఏపీలో 15 ఏళ్లకు పైబడిన జనాభాలో 92.3% మంది బ్యాంకింగ్‌ వ్యవస్థకు అనుసంధానం అయ్యారు. ...

గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రిస్క్‌ అండ్‌ రిజైౖలెన్స్‌ సూచీ

Published: October 22, 2025

హెన్లే అండ్‌ పార్టనర్స్, ఆల్ఫాజియో సంయుక్తంగా ‘2025 గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రిస్క్‌ అండ్‌ రిజైౖలెన్స్‌ ఇండెక్స్‌’ను విడుదల చేశాయి. ఆర్థిక, భౌగోళిక-రాజకీయ, పర్యావరణ అనిశ్చితులను తట్టుకుని, పుంజుకునే సామర్థ్యం ఆధారంగా 226 దేశాలకు ర్యాంకులు ఇచ్చారు. ...

ఐరాస నివేదిక

Published: October 22, 2025

ఐక్యరాజ్య సమితి 2025, అక్టోబరు 22న గ్లోబల్‌ ఫారెస్ట్‌ రిసోర్స్‌ అసెస్‌మెంట్‌-2025 నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటవీ విస్తీర్ణంలో భారత్‌ తొమ్మిదో స్థానానికి చేరుకుంది. ...

సీఆర్‌ఎస్‌ నివేదిక

Published: October 20, 2025

2023 జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకు దేశవ్యాప్తంగా జిల్లాలవారీగా నమోదైన జనన, మరణాల వివరాలతో ‘పౌర నమోదు వ్యవస్థ (సీఆర్‌ఎస్‌)’ తాజా నివేదికను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ...

యునెస్కో నివేదిక

Published: October 20, 2025

ప్రపంచవ్యాప్తంగా నేటికీ 133 మిలియన్ల (13.9 కోట్లు) మంది బాలికలకు చదువు అందట్లేదని యునెస్కో లింగ సాధికారత కొలమానం (జీఈఎం) తేల్చింది. ప్రాథమిక, మాధ్యమిక విద్యలో బాలురు, బాలికల నిష్పత్తి సమానంగా ఉంది....

‘ఇన్‌టూ ది లైట్‌ ఇండెక్స్‌ 2025’

Published: October 16, 2025

దక్షిణ ఆసియా దేశాల్లో చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులపై ఇటీవల ‘ఇన్‌టూ ది లైట్‌ ఇండెక్స్‌ 2025’ అనే నివేదిక విడుదలైంది. భారత్‌లో 2017-2022 మధ్య కాలంలో చిన్నారులపై లైంగిక నేరాల కేసులు 94 శాతం మేర అధికమైనట్లు నివేదిక పేర్కొంది. ...

2025 లింక్డ్‌ఇన్‌ జాబితా

Published: October 15, 2025

2025 లింక్డ్‌ఇన్‌ టాప్‌ స్టార్టప్స్‌ ఇండియా జాబితా ప్రకారం, దేశంలో అగ్రగామి అంకుర సంస్థగా క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ జెప్టో నిలిచింది. వరుసగా మూడో ఏడాదీ జెప్టో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది....

ఆలిండియా సింక్రొనస్‌ ఎలిఫెంట్‌ ఎస్టిమేషన్‌-2025

Published: October 14, 2025

దేశంలో ఏనుగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని ఆలిండియా సింక్రొనస్‌ ఎలిఫెంట్‌ ఎస్టిమేషన్‌-2025 పేరుతో నిర్వహించిన గణనలో తేలింది. 2017లో 27,312 ఉండగా ప్రస్తుతం 22,446కు పడిపోయింది. మొట్ట మొదటిసారిగా డీఎన్‌ఏ ఆధారంగా ఈ గణన నిర్వహించారు....

అవెండస్‌ వెల్త్‌-హురున్‌ ఇండియా జాబితా

Published: October 14, 2025

5 ఏళ్లలోపే కంపెనీలకు సారథ్యం వహిస్తున్న 155 మంది భారతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల జాబితాను అవెండస్‌ వెల్త్‌-హురున్‌ ఇండియా సంయుక్తంగా వెలువరచాయి. వీరి మొత్తం సంపద (443 బి. డాలర్లు/రూ.39 లక్షల కోట్లు) భారత జీడీపీలో పదో వంతు. ...

భారత్‌లో తగ్గిపోతున్న సూర్యరశ్మి పడే సమయం

Published: October 9, 2025

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సూర్యరశ్మి పడే సమయం తగ్గిపోతోందని ఓ అధ్యయనం వెల్లడించింది. హిమాలయ రాష్ట్రాలు, పశ్చిమ తీర ప్రాంతాల్లో గరిష్ఠంగా వరుసగా ఏడాదికి సగటున 9.5 గంటలు, 8.5 గంటల ఎండ పడే సమయం తగ్గిపోయిందని పేర్కొంది....

హురున్‌ రిచ్‌ లిస్ట్‌ 2025

Published: October 7, 2025

ప్రవాస భారతీయ (ఎన్నారై) బిలియనీర్లు అంతర్జాతీయంగా 101 మంది ఉన్నారని ‘హురున్‌ రిచ్‌ లిస్ట్‌-2025’ వెల్లడించింది. ఇందులో 48 మంది అమెరికాలో, 22 మంది యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో, బ్రిటన్‌లో 16 మంది, సైప్రస్‌ - సింగపూర్‌లలో ముగ్గురు చొప్పున ఉన్నారు....

డబ్ల్యూటీటీసీ నివేదిక

Published: October 5, 2025

వచ్చే పదేళ్లలో అంతర్జాతీయ పర్యాటక, ఆతిథ్య రంగంలో 9.1 కోట్ల కొత్త ఉద్యోగాలు రావొచ్చని వరల్డ్‌ ట్రావెల్‌ అండ్‌ టూరిజం కౌన్సిల్‌ (డబ్ల్యూటీటీసీ) నివేదికలో పేర్కొంది. అంటే అంతర్జాతీయంగా వచ్చే ప్రతి మూడు కొత్త ఉద్యోగాల్లో ఒకటి ఈ రంగంలోనే ఉంటుందని తెలిపింది. ...

హురున్‌ ఇండియా జాబితా- 2025   

Published: October 2, 2025

భారతదేశంలో అత్యంత సంపన్నుడిగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ, రెండో స్థానంలో అదానీ గ్రూపు ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ నిలిచారు....

ఐఎండీబీ నివేదిక

Published: September 30, 2025

సినిమాలకు రేటింగ్స్‌ ఇచ్చే ప్రముఖ ఎంటర్టైన్మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ ఒక్కో ఏడాదిలో విశేష ఆదరణ పొందిన చిత్రాల జాబితాను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా తమకున్న 250 మిలియన్లకుపైగా యూజర్లు ఇచ్చిన రేటింగ్‌ ఆధారంగా దీన్ని రూపొందించింది...

‘ప్రమాద మరణాలు-ఆత్మహత్యల సమాచార నివేదిక-2023’

Published: September 30, 2025

దేశవ్యాప్తంగా 2023లో 10,786 మంది రైతులు, వ్యవసాయ కూలీలు బలవన్మరణాలకు పాల్పడగా... అందులో 8.57 శాతం ఏపీ వారే....

కాజీరంగాలో 283 రకాల కీటక జాతులు

Published: September 27, 2025

ఖడ్గమృగాలు, ఏనుగులకు ప్రసిద్ధి చెందిన అస్సాంలోని కాజీరంగా నేషనల్‌ పార్కు.. ఎన్నో కీటక జాతులకు పుట్టినిల్లని ఓ అధ్యయనంలో తేలింది. ...

‘అవ్‌తార్‌’ సర్వే

Published: September 25, 2025

దేశంలోని కార్పొరేట్‌ సంస్థల్లో నాయకత్వ స్థానాల్లో ఉన్న మహిళల సంఖ్య ప్రస్తుతం 20 శాతానికి చేరినట్లు చెన్నైకి చెందిన ‘అవ్‌తార్‌’ అనే సంస్థ నిర్వహించిన సర్వే వెల్లడించింది. ...

‘గ్లోబల్‌ హైపర్‌ టెన్షన్‌ నివేదిక’

Published: September 23, 2025

ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మందికి అధిక రక్తపోటు (హై బీపీ) ప్రమాదకారిగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025, సెప్టెంబరు 23న విడుదల చేసిన ‘గ్లోబల్‌ హైపర్‌ టెన్షన్‌ నివేదిక’ స్పష్టం చేసింది. ...

2022-23 ఏడాదిపై కాగ్‌ నివేదిక

Published: September 22, 2025

దేశ ఆర్థిక స్థితిగతులపై ఆడిట్‌ నిర్వహించిన కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిట్‌ జనరల్‌ (కాగ్‌) 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సమగ్ర వివరాలను 2025, సెప్టెంబరు 22న విడుదల చేసింది....

‘టాప్‌ 2% శాస్త్రవేత్తల’ జాబితా

Published: September 22, 2025

ప్రపంచ ‘టాప్‌ 2% శాస్త్రవేత్తల’ జాబితాలో భారత్‌ నుంచి 3,372 మంది చోటు దక్కించుకున్నారు....

కాగ్‌ నివేదిక

Published: September 19, 2025

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రాల ఆర్థిక స్థితిపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ఆఫ్‌ ఇండియా కె. సంజయ్‌ మూర్తి 2025, సెప్టెంబరు 19న నివేదిక విడుదల చేశారు....

డబ్ల్యూఈఎఫ్‌ నివేదిక

Published: September 18, 2025

వాతావరణ మార్పులతో చోటుచేసుకునే అనారోగ్య సమస్యల కారణంగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై 2050 నాటికి 1.5 లక్షల కోట్ల డాలర్ల ప్రతికూల ప్రభావం పడే ముప్పు ఉందని ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక తెలిపింది...

క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌

Published: September 17, 2025

లండన్‌కు చెందిన క్యూఎస్‌ గ్లోబల్‌ ఎంబీఏ, ఆన్‌లైన్‌ ఎంబీఏ అండ్‌ బిజినెస్‌ మాస్టర్స్‌ ర్యాంకింగ్స్‌-2026 పేరుతో ర్యాంకింగ్స్‌ విడుదల చేసింది. మేనేజ్‌మెంట్‌కు సంబంధించి ప్రపంచంలో అత్యుత్తమ 100 బీ స్కూళ్లలో బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతా ఐఐఎంలు చోటు సంపాదించాయి. ...

డబ్ల్యూఎంవో నివేదిక

Published: September 16, 2025

సూర్యుడి నుంచి విడుదలయ్యే అతినీలలోహిత కిరణాలను అడ్డుకునే ఓజోన్‌ పొర మళ్లీ బలపడుతోందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) నివేదిక వెల్లడించింది....

నీతి ఆయోగ్‌ నివేదిక

Published: September 15, 2025

అన్ని రంగాల్లోనూ కృత్రిమ మేధ (ఏఐ)ను అందిపుచ్చుకోవడం పెరుగుతున్నందున 2035 కల్లా భారత జీడీపీకి అదనంగా దాదాపు రూ.44-52 లక్షల కోట్ల మేర జత అవుతుందని నీతి ఆయోగ్‌ నివేదిక అంచనా వేస్తోంది....

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram