ఆర్థిక రంగం

వాణిజ్య లోటు రూ.13.64 లక్షల కోట్లు

Published: October 19, 2025

ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి అర్ధ భాగం (ఏప్రిల్‌-సెప్టెంబరు)లో 24 దేశాలకు మన ఎగుమతుల్లో వృద్ధి నమోదైందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అధిక టారిఫ్‌ల వల్ల 2025 సెప్టెంబరులో అమెరికాకు మాత్రం మన ఎగుమతులు తగ్గాయని పేర్కొంది....

నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.11.89 లక్షల కోట్లు

Published: October 13, 2025

ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఇప్పటి వరకు (అక్టోబరు 12) నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 6.33% పెరిగి రూ.11.89 లక్షల కోట్లకు చేరాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఇవి రూ.11.18 లక్షల కోట్లుగా ఉన్నాయి. ...

2024-25లో 7.75 లక్షల టన్నుల చక్కెర ఎగుమతులు

Published: October 12, 2025

సెప్టెంబరుతో ముగిసిన 2024-25 మార్కెటింగ్‌ సీజన్‌లో మన దేశం 7.75 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి చేసినట్లు ఆలిండియా షుగర్‌ ట్రేడ్‌ అసోసియేషన్‌ (ఏఐఎస్‌టీఏ) వెల్లడించింది. ఏటా అక్టోబరు-సెప్టెంబరు మధ్య చక్కెర మార్కెటింగ్‌ సీజన్‌ నడుస్తుంది. ...

వృద్ధిరేటు అంచనాలు పెంచిన ప్రపంచ బ్యాంక్‌

Published: October 7, 2025

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో మన దేశ వృద్ధి అంచనాలను 6.3% నుంచి 6.5 శాతానికి ప్రపంచ బ్యాంక్‌ పెంచింది. వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ కొనసాగొచ్చని, వినియోగ వృద్ధి ఇందుకు అండగా నిలుస్తుందని వెల్లడించింది. ...

భారత్‌-ఈఎఫ్‌టీఏ ఒప్పందం అమల్లోకి 

Published: October 2, 2025

భారత్, నాలుగు ఐరోపా దేశాల కూటమి (ఈఎఫ్‌టీఏ) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు...

చిన్న మొత్తాల పొదుపు వడ్డీ రేట్లు

Published: September 30, 2025

చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లపై ప్రభుత్వం యథాతథ స్థితిని కొనసాగించింది. అక్టోబరు 1 నుంచి డిసెంబరు 31 వరకు, ప్రజా భవిష్య నిధి, జాతీయ పొదుపు పత్రంతో పాటు ఇతర పొదుపు పథకాలపై పాత వడ్డీ రేట్లే వర్తించనున్నాయి. ...

భారత రేటింగ్‌ ‘బీఏఏ3’

Published: September 29, 2025

భారత్‌కున్న బలమైన ఆర్థిక మూలాలను పరిగణనలోకి తీసుకుని భారత దీర్ఘకాలిక దేశీయ, విదేశ కరెన్సీ ఇష్యూయర్‌ రేటింగ్స్, దేశీయ కరెన్సీ అన్‌సెక్యూర్డ్‌ రేటింగ్‌ను అంతర్జాతీయ ఏజెన్సీ మూడీస్‌ ‘బీఏఏ3’గా నిర్ణయించింది....

ప్రపంచ అగ్రశ్రేణి 10 వాహన సంస్థలు

Published: September 26, 2025

మార్కెట్‌ విలువ పరంగా ప్రపంచంలోని అత్యంత విలువైన తొలి 10 వాహన తయారీ సంస్థల్లో మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ)కు  స్థానం దక్కింది. ...

భారీ నౌకా నిర్మాణ పరిశ్రమకు మౌలిక హోదా

Published: September 23, 2025

భారత్‌లో తయారీని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా భారీ నౌకా నిర్మాణ పరిశ్రమకు మౌలిక హోదాను ప్రభుత్వం ఇచ్చింది. ...

డబ్ల్యూఈఎఫ్‌ అంచనాలు

Published: September 23, 2025

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ బలహీన వృద్ధి దశలోకి అడుగుపెడుతోందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) తాజాగా విడుదల చేసిన ‘చీఫ్‌ ఎకనమిస్ట్స్‌ అవుట్‌లుక్‌’లో పేర్కొంది....

భారత రేటింగ్‌ను పెంచిన జపాన్‌ సంస్థ

Published: September 19, 2025

భారత దీర్ఘకాలిక సార్వభౌమ రుణ రేటింగ్‌ను ‘బీబీబీ’ నుంచి ‘బీబీబీ+’కు పెంచుతున్నట్లు జపాన్‌ సంస్థ రేటింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ (ఆర్‌ అండ్‌ ఐ) ప్రకటించింది....

2025-26లో ద్రవ్యోల్బణం 3.2%

Published: September 13, 2025

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ద్రవ్యోల్బణం 3.2 శాతంగా నమోదు కావొచ్చని రిసెర్చ్‌ అండ్‌ రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ అంచనా వేసింది. గతంలో అంచనా వేసిన 3.5 శాతం నుంచి 3.2 శాతానికి కుదించింది....

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram