వరసగా నాలుగో సంవత్సరంలోనూ చైనాలో జనాభా తగ్గింది. 2015 నాటి పరిస్థితితో పోలిస్తే 2025లో దాదాపు కోటి మేర ఈ తగ్గుదల ఉంది. దంపతులకు ఒకే బిడ్డ అనే విధానాన్ని చాలాఏళ్లపాటు అమలుచేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని విశ్లేషకులు చెబుతున్నారు....
ఉగాండా అధ్యక్షునిగా ఏడోసారి ముసెవేని గెలుపు
Published: January 17, 2026
ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవేని ఏడోసారి దేశాధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకున్నారు. పోలైన మొత్తం ఓట్లలో ఆయనకు 71.65 శాతం దక్కాయని ఆ దేశ ఎలక్షన్ కమిషన్ 2026, జనవరి 17న వెల్లడించింది. ...
ట్రంప్ ఛైర్మన్గా గాజా శాంతి మండలి
Published: January 16, 2026
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఛైర్మన్గా గాజా శాంతి మండలి ఏర్పాటైంది. కాల్పుల విరమణ ఒప్పందంలోని రెండో దశ ప్రారంభమైందని పశ్చిమాసియా అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ ప్రకటించిన కొద్ది సేపటికే తన నేతృత్వంలో మండలి ఏర్పాటైనట్లు ప్రకటించారు. ...
75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్ నిలిపివేత
Published: January 14, 2026
పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, రష్యా సహా మొత్తం 75 దేశాల పౌరులకు తమ దేశ వీసా ప్రాసెసింగ్ను నిలిపివేయనున్నట్లు అమెరికా ప్రభుత్వ 2026, జనవరి 14న ప్రకటించింది....
శ్రీలంకలో భారత్ నిర్మించిన బెయిలీ వంతెన ప్రారంభం
Published: January 11, 2026
భారత సహకారంతో శ్రీలంకలో నిర్మించిన మొదటి బెయిలీ వంతెన (తాత్కాలిక వంతెన)ను 2026, జనవరి 11న ప్రారంభించారు. సెంట్రల్ ప్రావిన్స్-ఉవా ప్రావిన్స్ మధ్య రాకపోకలకు కీలకంగా ఉన్న రహదారి అనుసంధానం 2025, నవంబరులో వచ్చిన దిత్వా తుపానుతో ధ్వంసమైంది....
అమెరికా రక్షణశాఖకు రూ.135 లక్షల కోట్లు
Published: January 8, 2026
2027 ఆర్థిక సంవత్సరానికిగానూ సైనిక బడ్జెట్ను 1.5 ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ.135 లక్షల కోట్లు) పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు....
మధ్య ఆఫ్రికా అధ్యక్షుడిగా టౌడెరా
Published: January 6, 2026
మధ్య ఆఫ్రికా రిపబ్లిక్ దేశ అధ్యక్షుడిగా ఫస్టీన్ అర్చాంజ్ టౌడెరా మూడోసారి విజయం సాధించారు. 2025, డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో దాదాపు 76 శాతం ఓట్లతో ఆయన నెగ్గినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ...
వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్
Published: January 4, 2026
వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలు, చమురు, ఆర్థికశాఖల మంత్రి డెల్సీ రోడ్రిగ్జ్ 2025, జనవరి 4న బాధ్యతలు చేపట్టారు. 90 రోజులపాటు ఆమె అధికారంలో ఉంటారని రక్షణ మంత్రి పాడ్రినో ప్రకటించారు. ...
చైనా అమ్ములపొదిలో అధునాతన యుద్ధనౌక
Published: January 2, 2026
చైనా తన నౌకాదళంలోకి మరింత మెరుగుపరిచిన మిసైల్ డిస్ట్రాయర్ను చేర్చింది. టైప్ 052డి తరగతికి చెందిన ఈ యుద్ధనౌకకు లౌడీ అని పేరు పెట్టారు. ఇందులో మెరుగైన రాడార్, ఆయుధ, నెట్వర్క్ వ్యవస్థలు ఉన్నాయి. ...
న్యూయార్క్ మేయర్గా సబ్వేలో మమ్దానీ ప్రమాణం
Published: January 1, 2026
అమెరికాలోని న్యూయార్క్ నగర 112వ మేయర్గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ ప్రమాణం చేశారు. మాన్హట్టాన్లోని ఓ చారిత్రక సబ్వే స్టేషన్లో ఈ కార్యక్రమం జరిగింది. ఖురాన్పై ప్రమాణం చేసి.. న్యూయార్క్లో తొలి ముస్లిం మేయర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ...
శ్రీలంకకు 45 కోట్ల డాలర్ల ప్యాకేజీ
Published: December 23, 2025
దిత్వా తుపాను కారణంగా అతలాకుతలమైన శ్రీలంకకు భారత్ 45 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. శ్రీలంక పునర్నిర్మాణానికి స్థిరమైన నిబద్ధతతో భారత్ ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. ...