తెలంగాణ పోలీస్ నియామకాలు 2026 | 7,437 పోస్టులు | TSLPRB Notification
అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది | 29 జులై 2026

తెలంగాణలో
0 పోలీస్‌ పోస్టులు

పోలీస్, ప్రత్యేక రక్షణ దళం (ఎస్‌పీఎఫ్), అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో మొత్తం 7,437 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) 2026, జులై 29న నోటిఫికేషన్‌లు జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణ తేదీని త్వరలోనే ప్రకటించనుంది.

జీతం ₹24,280 – ₹72,850 అర్హత: ఇంటర్మీడియట్ వయసు: 18–22 + సడలింపు
ప్రిలిమ్స్ · 200 మార్కులు · 3 గం.
PET · 1,600మీ / 7:15
TOTAL VACANCIES
0 పోస్టులు
4 శాఖల్లో భర్తీ · TSLPRB 2026
పోలీస్ శాఖ5,000
ప్రత్యేక రక్షణ దళం (SPF)1,424
అగ్నిమాపక శాఖ790
జైళ్ల శాఖ223
నోటిఫికేషన్: 29.07.2026 దరఖాస్తు ప్రారంభ తేదీ: 19-08-2026 దరఖాస్తు చివరి తేదీ: 09-09-2026
0
పోలీస్ శాఖ
Police Dept.
0
ప్రత్యేక రక్షణ దళం
SPF
0
అగ్నిమాపక శాఖ
Fire Services
0
జైళ్ల శాఖ
Prisons Dept.
నోటిఫికేషన్ విడుదల: 29 జులై 2026 దరఖాస్తుల స్వీకరణ తేదీ త్వరలో ప్రకటన మొత్తం పోస్టులు: 7,437 — పోలీస్ 5,000 · SPF 1,424 · అగ్నిమాపక 790 · జైళ్లు 223 దరఖాస్తు సమర్పించిన తర్వాత మార్పులు చేసుకోలేరు — జాగ్రత్తగా నింపండి అవసరమైన ధ్రువపత్రాలను ముందుగానే సమకూర్చుకోండి
Department-wise Breakup

శాఖల వారీగా ఖాళీల వివరాలు

నాలుగు శాఖల్లోని పోస్ట్-లెవల్ ఖాళీల విభజన — ఎస్సై నుంచి కానిస్టేబుల్ వరకు అన్ని ర్యాంకుల వివరాలు ఇక్కడ చూడండి.

సివిల్‌ ఎస్సై148
ఏఆర్‌ ఎస్సై14
టీజీఎస్పీ ఏఆర్‌ ఎస్సై12
ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌ ఎస్సై3
ఫింగర్‌ప్రింట్‌ బ్యూరో ఏఎస్సై23
సివిల్‌ కానిస్టేబుల్‌3,697
ఏఆర్‌ కానిస్టేబుల్‌1,052
ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌ కానిస్టేబుల్‌24
కానిస్టేబుల్‌ (డ్రైవర్‌) పీటీవో20
కానిస్టేబుల్‌ (మెకానిక్‌) పీటీవో7
పోలీస్ శాఖ — మొత్తం ఖాళీలు 5,000
స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌39
ఫైర్‌ ఫైటర్‌ — LMV లైసెన్స్ తప్పనిసరి751
అగ్నిమాపక శాఖ — మొత్తం ఖాళీలు 790
డిప్యూటీ జైలర్‌ (పురుషులు)14
డిప్యూటీ జైలర్‌ (మహిళలు)1
వార్డర్‌ (పురుషులు)196
వార్డర్‌ (మహిళలు)12
జైళ్ల శాఖ — మొత్తం ఖాళీలు 223
ఎస్సై (SPF)44
కానిస్టేబుల్‌ (SPF)1,380
ప్రత్యేక రక్షణ దళం — మొత్తం ఖాళీలు 1,424
Key Highlights

ఇతర ముఖ్య వివరాలు

జీతం, విద్యార్హత, వయోపరిమితి — దరఖాస్తు చేసుకునే ముందు తెలుసుకోవాల్సిన ప్రధాన అంశాలు.

జీతం (పే స్కేల్)

₹24,280 — ₹72,850
  • పోస్టును బట్టి పే స్కేల్ వర్తిస్తుంది
  • యూనిఫామ్డ్ సర్వీస్ అలవెన్సులు అదనంగా
  • శాఖలవారీగా ప్రత్యేక భత్యాలు ఉంటాయి

విద్యార్హతలు

  • ఎస్సై పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2026 జులై 29 నాటికి ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉన్నవారిని కూడా అర్హులుగానే పరిగణిస్తారు. ఫైర్‌ ఫైటర్‌ పోస్టుకు అదనంగా చెల్లుబాటు అయ్యే ఎల్‌ఎంవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరి.

వయోపరిమితి

18 — 22 సంవత్సరాలు
  • యూనిఫామ్డ్ సర్వీసులకు గరిష్ఠ వయోపరిమితిపై ప్రభుత్వం +5 ఏళ్ల అదనపు సడలింపు
  • SC / ST / BC / EWS అభ్యర్థులకు మరో +5 ఏళ్ల వయో సడలింపు
  • ఎక్స్ సర్వీస్‌మెన్‌, NCC తదితర వర్గాలకు నిబంధనల ప్రకారం సడలింపు
Selection Process

ఎంపిక ప్రక్రియ — మూడు దశలు

ప్రిలిమినరీ రాత పరీక్ష → ఫిజికల్ టెస్టులు (PMT/PET) → ఫైనల్ రాత పరీక్ష. ప్రతి దశకు సంబంధించిన పూర్తి వివరాలు.

01 దశ — 1
ప్రిలిమినరీ రాత పరీక్ష
200 మార్కులు 3 గంటలు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు 20% నెగెటివ్ మార్కింగ్

తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో 20 శాతం తగ్గింపు. అర్హతకు కనీస మార్కులు:

OC / EWS30%
BC25%
SC / ST / ఎక్స్ సర్వీస్ / హోంగార్డులు20%
02 దశ — 2
ఫిజికల్ టెస్టులు (PMT / PET)

రాత పరీక్షలో అర్హత సాధించినవారికి ఫిజికల్ మెజర్‌మెంట్‌ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.

పరుగు
పురుషులు 1,600మీ — 7:15 · మహిళలు 800మీ — 5:20 · ఎక్స్ సర్వీస్‌మెన్ 1,600మీ — 9:30 వ్యవధిలో పూర్తి చేయాలి
కనీస ఎత్తు
పురుషులు 167.6 సెం.మీ · మహిళలు 152.5 సెం.మీ
ఏజెన్సీ ప్రాంత STలకు సడలింపు
లాంగ్ జంప్
పురుషులు 4మీ
మహిళలు 2.5మీ అర్హత
షాట్‌పుట్
పురుషులు 6 మీటర్లు · మహిళలు 4 మీటర్లు అర్హత అవసరం
03 దశ — 3
ఫైనల్ రాత పరీక్ష
3 గంటలు ఒకే పేపర్ 100 / 200 మార్కులు

PETలో అర్హత సాధించిన వారికి. పోస్టును బట్టి మార్కులు:

కానిస్టేబుల్ (సివిల్) · ఫైర్ ఫైటర్ · వార్డర్200
కానిస్టేబుల్ (AR) · SAR CPL · SPF కానిస్టేబుల్100

కనీస అర్హత మార్కులు:

OC / EWS40%
BC35%
SC / ST / ఎక్స్ సర్వీస్‌మెన్30%
Application Guide

దరఖాస్తు విధానం

ఆన్‌లైన్ దరఖాస్తును నాలుగు సులభ దశల్లో పూర్తి చేయండి — రిజిస్ట్రేషన్ నుంచి తుది సమర్పణ వరకు.

01
రిజిస్ట్రేషన్

టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో మీ మొబైల్‌ నంబర్‌తో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి.

02
పార్ట్-I దరఖాస్తు

కావలసిన పోస్టులను ఎంపిక చేసుకుని, పరీక్షా ఫీజు చెల్లించి పార్ట్-I దరఖాస్తును పూర్తి చేయాలి.

03
ఫొటో + సంతకం అప్‌లోడ్

ఫొటో, సంతకాన్ని కలిపి ఒకే JPG ఫైల్‌గా అప్‌లోడ్ చేయాలి. ఫైల్ పరిమాణం 30KB నుంచి 100KB మధ్య ఉండాలి.

04
పార్ట్-II దరఖాస్తు

ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన తర్వాత పార్ట్-II దరఖాస్తు పూర్తి చేసి, అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి.

గమనిక

దరఖాస్తు సమర్పించిన తర్వాత వివరాల్లో మార్పులు చేసుకునే అవకాశం ఉండదు. అన్ని వివరాలు జాగ్రత్తగా పరిశీలించి ఫైనల్ సబ్మిట్ చేయండి.

NOTIFICATION DATE
29.07.2026
నోటిఫికేషన్ వెలువడిన తేదీ
APPLICATION DATES
దరఖాస్తు ప్రారంభ తేదీ: 19-08-2026
దరఖాస్తు చివరి తేదీ: 09-09-2026
OFFICIAL WEBSITE & APPLICATION LINK
Official Website: tgprb.in
Apply Online: Click Here to Apply
Certificates Checklist

సమకూర్చుకోవాల్సిన ధ్రువీకరణపత్రాలు

ఆన్‌లైన్‌లో దరఖాస్తు దాఖలు చేసే ముందే, తెలంగాణలో స్థానికులైన అభ్యర్థులు ఈ ధ్రువపత్రాలను సమకూర్చుకోవాలని మండలి సూచించింది.

SC

గ్రూప్-1, 2, 3 ఉపవర్గీకరణతో కూడిన తాజా సామాజిక ధ్రువపత్రం.

ST

ఎస్టీ అభ్యర్థులు తమ కులం సర్టిఫికెట్ సమకూర్చుకోవాలి.

EWS

ఈ ఏడాది ఏప్రిల్ 1 తర్వాత ప్రభుత్వం నుంచి పొందిన ఆర్థికంగా బలహీనవర్గాల (EWS) ధ్రువీకరణపత్రం.

BC

ఈ ఏడాది ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్న నాన్-క్రీమీలేయర్ సర్టిఫికెట్.

అందరికీ

1–7 తరగతుల బోనఫైడ్ సర్టిఫికెట్లు లేదా నివాస ధ్రువీకరణపత్రం (రెండింటిలో ఏవి వర్తిస్తే అవి).

ప్రత్యేక కేటగిరీ

దివ్యాంగ, స్పోర్ట్స్ తదితర ప్రత్యేక కేటగిరీల కింద అర్హులైతే సంబంధిత ధ్రువపత్రాలు.

ఈనాడు · ఈప్రతిభ

‘తెలంగాణ పోలీస్ పరీక్షల ప్రత్యేకం’ కోర్సు

తెలంగాణ పోలీస్ నియామక పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఈనాడు ఈప్రతిభ రూపొందించిన ప్రత్యేక కోర్సు ఇది. పోలీస్ పరీక్షల సిలబస్‌కు అనుగుణంగా అంశాల వారీ స్టడీ మెటీరియల్, ప్రతి నెలా అప్డేట్ అయ్యే కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్, వివరణాత్మక సమాధానాలు ఇందులో అందుబాటులో ఉన్నాయి. మీ ప్రిపరేషన్‌ను మరింత క్రమబద్ధంగా కొనసాగించేందుకు అవసరమైన అధ్యయన వనరులను ఒకే వేదికపై అందించడమే ఈ కోర్సు లక్ష్యం.

  • అంశాల వారీగా విభజించిన పూర్తిస్థాయి మెటీరియల్
  • కరెంట్ అఫైర్స్ మంత్లీ ఈబుక్స్ — ప్రతి నెలా అప్‌డేట్
  • ఈప్రతిభ యాప్‌లోనూ, వెబ్‌సైట్‌లోనూ అందుబాటు
750+
ప్రీ రికార్డెడ్ వీడియో పాఠాలు
850+
జనరల్ స్టడీస్ ఈబుక్స్
500+
ప్రాక్టీస్ టెస్ట్స్
కరెంట్ అఫైర్స్ మంత్లీ ఈబుక్స్ + ప్రాక్టీస్ టెస్ట్స్ కూడా అందుబాటులో
Available Courses

అందుబాటులో ఉన్న కోర్సులు & ధరలు

మీ ప్రిపరేషన్ దశకు తగిన కోర్సును ఎంచుకోండి ప్రతి కోర్సులోనూ వీడియో పాఠాలు, ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్‌లు అందుబాటులో ఉంటాయి.

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram