రైల్వేలో టెక్నీషియన్స్ - RRB Recruitment 2026
Indian Railway Metro Station
RRB నోటిఫికేషన్ 2026

రైల్వేలో
టెక్నీషియన్స్

6557
మొత్తం ఖాళీలు
323
గ్రేడ్-1 పోస్టులు
6234
గ్రేడ్-3 పోస్టులు
July 29
చివరి తేదీ
ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీటెక్‌తో అర్హత
దేశ వ్యాప్తంగా ఖాళీలు
రూ19900 - 29200 వేతనం
కంప్యూటర్ బేస్డ్ పరీక్ష

రైల్వే కొలువులకు మరో అవకాశం

రైల్వే కొలువులకు మరో అవకాశం ఎదురుచూస్తోంది. టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. దేశ వ్యాప్తంగా 6557 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీటెక్‌తో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలో ప్రతిభతో నియామకాలుంటాయి. ఉద్యోగంలో చేరినవారు ఆకర్షణీయ వేతనంతో పాటు సుస్థిర కెరియర్‌నూ సొంతం చేసుకోవచ్చు.

గత రెండేళ్ల నుంచీ రైల్వేలో టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి ప్రకటనలు వెలువడుతున్నాయి. అందువల్ల వీటిని లక్ష్యంగా చేసుకున్నవారు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంది. నియామకాలు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ)ల వారీగా ఉంటాయి. పరీక్ష మాత్రం అందరికీ ఉమ్మడిగా నిర్వహిస్తారు. ఆసక్తి, అర్హతలు ఉన్నవారు ఏదో ఒక ఆర్‌ఆర్‌బీలోని ఖాళీలకే దరఖాస్తు చేసుకోవాలి. అందులోని జోన్లవారీ ప్రాధాన్యం ఎంచుకోవాలి. పరీక్ష కోసం తెలుగు మాధ్యమాన్నీ ఎంచుకోవచ్చు. గ్రేడ్‌-1, గ్రేడ్‌-3 విభాగాల్లో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హతలు ఉన్నవారు రెండు పోస్టులకూ విడిగా దరఖాస్తు చేసుకోవచ్చు.

Study Materials & Courses Premium Preparation Courses

1

పోస్టు: టెక్నీషియన్ గ్రేడ్-1 (సిగ్నల్) గ్రేడ్ పే: లెవెల్-5 | వేతనం: రూ.29,200+ | ఖాళీలు: 323

టెక్నీషియన్ గ్రేడ్-1 వివరాలు
323 ఖాళీలు
రూ.29,200
మూల వేతనం | DA, HRA, ఇతర అలవెన్సులతో మొదటి నెల నుంచే సుమారు రూ.60,000 వరకు
అర్హత:
ఫిజిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ వీటిలో ఏదైనా ఒక సబ్జెక్టుతో బీఎస్సీ/ డిప్లొమా/ బీఈ/ బీటెక్‌ పూర్తిచేయాలి.
వయసు:
జులై 1, 2026 నాటికి 18–33 ఏళ్ళ మధ్యలో ఉండాలి.
వేతనం:
గ్రేడ్‌-1 టెక్నీషియన్లకు లెవెల్‌-5 రూ.29,200 మూల వేతనం చెల్లిస్తారు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులతో వీరు సుమారు రూ.60,000 జీతం మొదటి నెల నుంచే అందుకోవచ్చు
పరీక్ష:
కంప్యూటర్ బేస్డ్ విధానంలో 100 మార్కులు | 100 ప్రశ్నలు | 90 నిమిషాలు
ప్రశ్నాంశాలు:
జనరల్ అవేర్‌నెస్ 10 జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 15 కంప్యూటర్ అప్లికేషన్స్ బేసిక్స్ 20 మ్యాథమెటిక్స్ 20 బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 35
వ్యవధి:
90 నిమిషాలు | ప్రతి ప్రశ్నకు 54 సెకన్లు
నెగటివ్ మార్కింగ్:
తప్పు సమాధానానికి 1/3 మార్కు తగ్గిస్తారు
అర్హత మార్కులు:
అన్‌రిజర్వుడ్/EWS: 40 | OBC(NCL)/SC: 30 | ST: 25
ఎంపిక విధానం:
CBT → మెరిట్‌లో ఉన్నవారి ధ్రువపత్రాల పరిశీలన → వైద్య పరీక్ష → నియామకం
2

పోస్టు: టెక్నీషియన్ గ్రేడ్-3 గ్రేడ్ పే: లెవెల్-2 | వేతనం: రూ.19,900+ | ఖాళీలు: 6234

టెక్నీషియన్ గ్రేడ్-3 వివరాలు
6234 ఖాళీలు
రూ.19,900
మూల వేతనం | DA, HRA, ఇతర అలవెన్సులతో సుమారు రూ.40,000 వరకు
Train Engineer
అర్హత:
పదో తరగతి తర్వాత సంబంధిత ట్రేడులు/విభాగాల్లో ITI లేదా అప్రెంటిస్‌షిప్ పూర్తిచేయాలి.
వయసు:
జులై 1, 2026 నాటికి 18–30 ఏళ్ళ మధ్యలో ఉండాలి (రిజర్వేషన్ కేటగిరీలకు సడలింపు వర్తిస్తుంది).
పరీక్ష:
ఆన్‌లైన్‌లో 100 మార్కులు | 100 ప్రశ్నలు | 90 నిమిషాలు
ప్రశ్నాంశాలు:
మ్యాథమెటిక్స్ 25 జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 జనరల్ సైన్స్ 40 జనరల్ అవేర్‌నెస్ 10
వ్యవధి:
90 నిమిషాలు | ప్రతి ప్రశ్నకు 54 సెకన్లు
నెగటివ్ మార్కింగ్:
తప్పు సమాధానానికి 1/3 మార్కు తగ్గిస్తారు
అర్హత మార్కులు:
అన్‌రిజర్వుడ్/EWS: 40 | OBC(NCL)/SC: 30 | ST: 25
పదోన్నతి:
అనుభవం, అంతర్గత పరీక్షలతో గ్రేడ్-2, గ్రేడ్-1 టెక్నీషియన్లుగా పదోన్నతులు పొందవచ్చు.
ముఖ్య గమనికలు:
  • గ్రేడ్-1, గ్రేడ్-3 రెండు పరీక్షలనూ ఒకే అభ్యర్థి రాయవచ్చు — విడిగా దరఖాస్తు చేయాలి.
  • ఏదో ఒక RRB జోన్‌లోని ఖాళీలకే దరఖాస్తు చేసుకోవాలి; అందులో జోన్ల వారీ ప్రాధాన్యం ఎంచుకోవాలి.
  • పరీక్ష కోసం తెలుగు మాధ్యమాన్నీ ఎంచుకోవచ్చు.
  • మెరిట్‌లో ఉన్నవారి ధ్రువపత్రాలు పరిశీలించి, వైద్య పరీక్షల అనంతరమే ఉద్యోగానికి తీసుకుంటారు.
  • ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)కు మూడేళ్లు, దివ్యాంగులకు కేటగిరీని బట్టి పది నుంచి పదిహేనేళ్ల వరకూ గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది (రెండు పోస్టులకూ వర్తిస్తుంది).
  • పరీక్ష రాసి అర్హత సాధిస్తే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్‌జెండర్, ఈబీసీలకు రుసుము (బ్యాంకు ఛార్జీలు మినహాయించి) వెనక్కి ఇస్తారు.
3

గ్రేడ్-3 సన్నద్ధత టిప్స్ పరీక్షలో విజయానికి మార్గదర్శకాలు

Student Studying
సన్నద్ధత

సన్నద్ధత వ్యూహాలు

  • నోటిఫికేషన్‌లో సిలబస్‌ వివరాలు ఉన్నాయి. వాటిని గమనించాలి. అందులోని అంశాలే శ్రద్ధగా చదివితే సరిపోతుంది.
  • విభాగాల వారీ ప్రాథమికాంశాల నుంచి సన్నద్ధత ప్రారంభించాలి. చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలు నోట్సు రాసుకోవాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.
  • అన్ని అంశాలూ చదవడం పూర్తయిన తర్వాత గత ప్రశ్నాపత్రాలు పరిశీలించాలి. పరీక్ష కోణంలో ఆలోచించి ఏ అంశాలకు ప్రాధాన్యమివ్వాలో తెలుసుకుని, వాటిని మరోసారి బాగా చదివి, మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.
  • అధ్యయనం పూర్తయిన తర్వాత మాక్‌ టెస్టులు రాసి, ఫలితాలు విశ్లేషించుకోవాలి. తప్పులు చేస్తోన్న అంశాలు మళ్లీ శ్రద్ధగా చదవాలి. ముందు పరీక్షల్లో చేసిన తప్పులు పునరావృతం కాకుండా, పరీక్షల వారీ స్కోరులో మెరుగుదల ఉండేలా సాధన చేయాలి.
  • రుణాత్మక మార్కులు ఉన్నందున తెలియనివి వదిలేయాలి.
  • ప్రతి ప్రశ్నకూ గరిష్ఠంగా 54 సెకన్లే ఉంటుంది. అందువల్ల బాగా తెలిసిన ప్రశ్నలే ముందు పూర్తి చేయాలి. సమాధానం గుర్తించడానికి ఎక్కువ సమయం తీసుకునేవాటిని చివరిలోనే ప్రయత్నించాలి.
  • సన్నద్ధత కోసం ఏ పుస్తకాలు తీసుకున్నప్పటికీ పరీక్షలో పేర్కొన్న అంశాలకే పరిమితమై, వాటినే బాగా సాధన చేయాలి.
  • మ్యాథమెటిక్స్‌ విభాగంలో ప్రశ్నలకు ఆబ్జెక్టివ్‌ అరిథ్‌మెటిక్‌ - ఆర్‌ఎస్‌ అగర్వాల్‌ పుస్తకం సరిపోతుంది. ఈ విభాగంలో త్రికోణమితి, ఆల్జీబ్రా.. తదితర అంశాల కోసం పదో తరగతి గణిత పుస్తకాన్ని బాగా చదివి, వీలైనన్ని ప్రశ్నలు సాధన చేయాలి.
  • జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ విభాగానికీ ఆర్‌ఎస్‌ అగర్వాల్‌ రీజనింగ్‌ పుస్తకం లేదా మరోటి ఏదైనా తీసుకోవచ్చు.
  • జనరల్‌ సైన్స్‌పై అధిక దృష్టి సారించాలి. వంద మార్కుల పరీక్షలో ఈ విభాగానికే 40 కేటాయించారు. విజయాన్ని నిర్ణయించడంలో ఇవే కీలకం. 8, 9, 10 తరగతుల భౌతిక, రసాయన, జీవశాస్త్రాల పుస్తకాలు క్షుణ్నంగా చదవాలి. పాఠ్యాంశాల చివరిలో ఉన్న ముఖ్యాంశాలన్నీ ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. అలాగే ఈ విభాగాల్లో ఏపీఆర్‌జేసీ, పాలిటెక్నిక్‌ పాత, మాదిరి ప్రశ్నలు బాగా చదివితే ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది.
  • జనరల్‌ అవేర్‌నెస్‌ కోసం పత్రికలు చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలు నోట్సు రాసుకోవాలి. సిలబస్‌లో పేర్కొన్న అంశాలకు చెందిన తాజా వార్తలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
దరఖాస్తు రుసుము వివరాలు
వర్గం రుసుము గమనిక
మహిళలు / SC / ST / ట్రాన్స్‌జెండర్ / EBC రూ.250 ✔ పరీక్షకు హాజరైతే బ్యాంకు ఛార్జీలు మినహాయించి మిగతా ఫీజు వెనక్కి
ఇతర వర్గాలు (జనరల్ / OBC / EWS) రూ.500 ✔ పరీక్ష రాస్తే రూ.100 + బ్యాంకు ఛార్జీలు మినహాయించి మిగతా మొత్తం వెనక్కి
చెల్లింపు: నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డు, UPI ద్వారా చెల్లించవచ్చు. బ్యాంక్ చార్జీలు అదనంగా వర్తిస్తాయి.
ముఖ్య తేదీలు
దరఖాస్తు ప్రారంభం
చివరి తేదీ
జులై 29, 2026
రుసుము చెల్లింపు
జులై 29, 2026 వరకు
CBT పరీక్ష తేదీ
త్వరలో ప్రకటిస్తారు

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram