అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవం

అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవం

ప్రజాజీవనానికి తీవ్రనష్టం కలిగించి.. వనరులను ధ్వంసం చేసి.. సాధారణ కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగించేవే విపత్తులు. ఇవి సహజసిద్ధంగా లేదా మానవ చర్యల ఫలితంగా వస్తాయి. వరదలు, తుపానులు, భూకంపాలు, కార్చిచ్చులు, సునామీ, కరవు, బాంబు పేలుడు మొదలైనవన్నీ దీని రూపాలే. ఇటీవలి కాలంలో ప్రచంచవ్యాప్తంగా విపత్తులు పెరిగిపోతున్నాయి. వీటివల్ల ప్రాణ, ఆస్తి నష్టంతోపాటు పర్యావరణ సమస్యలూ ఏర్పడుతున్నాయి. విపత్తుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా అక్టోబరు 13న ‘అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవం’గా (International Day for Disaster Risk Reduction) నిర్వహిస్తారు. అనుకోని దుర్ఘటనలు సంభవించినప్పుడు ఏ విధంగా ప్రతిస్పందించాలి, నష్ట నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై పౌరులను చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

చారిత్రక నేపథ్యం

ప్రమాద అవగాహన, విపత్తుల నిర్వహణలో చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించేందుకు ఒక రోజును ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్య సమితి భావించింది. దీనికి అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా అక్టోబరు 13న అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవాన్ని జరుపుకోవాలని 1989లో యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీ తీర్మానించింది. 

2025 నినాదం: Fund Resilience, Not Disasters

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram