దేశంలోని కార్పొరేట్ సంస్థల్లో నాయకత్వ స్థానాల్లో ఉన్న మహిళల సంఖ్య ప్రస్తుతం 20 శాతానికి చేరినట్లు చెన్నైకి చెందిన ‘అవ్‌తార్’ అనే సంస్థ నిర్వహించిన సర్వే వెల్లడించింది. కార్యాలయాల్లోనూ ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని తెలిపింది.
సర్వేలోని ముఖ్యాంశాలు:
ఐటీ, పరిశోధన, ఆర్థిక, వినియోగదారుల సేవలు అందించే జీసీసీ రంగంలో 22 శాతం మంది నాయకత్వం వహిస్తున్నారని చెప్పింది. కంపెనీల్లోని వివిధ స్థాయుల ఉద్యోగాల్లో 35.7 శాతం మంది మహిళలు విధుల్లో ఉన్నట్లు తెలిపింది.
ప్రొఫెషనల్ రంగంలో అతివలు అత్యధికంగా 44.6 శాతం ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత స్థానాల్లో ఐటీఈఎస్‌లో 41.7 శాతం, ఫార్మాలో 25 శాతం, వేగంగా వ్యాపారం జరిగే ఎఫ్‌ఎంసీజీ రంగంలో 23 శాతం, తయారీ రంగంలో 12 శాతం మహిళా ఉద్యోగులే ఉన్నట్లు వివరించింది.