దేశ ఆర్థిక స్థితిగతులపై ఆడిట్ నిర్వహించిన కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సమగ్ర వివరాలను 2025, సెప్టెంబరు 22న విడుదల చేసింది.
రెవెన్యూ మిగులు రాష్ట్రాల్లో తెలంగాణ, లోటు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.
దీని ప్రకారం.. 2023 మార్చి నాటికి దేశంలోని 28 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాలు రెవెన్యూ మిగులు, 12 రాష్ట్రాలు రెవెన్యూ లోటులో ఉన్నాయి.
రెవెన్యూ మిగులులో రూ.37,263 కోట్లతో ఉత్తర్‌ప్రదేశ్ ప్రథమస్థానంలో నిలవగా, తర్వాతి స్థానాల్లో గుజరాత్, ఒడిశాలు ఉన్నాయి.
12 రాష్ట్రాల మొత్తం రెవెన్యూ లోటు రూ.2,22,648 కోట్లుగా ఉంది.