భారత్‌లో తయారీని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా భారీ నౌకా నిర్మాణ పరిశ్రమకు మౌలిక హోదాను ప్రభుత్వం ఇచ్చింది. భారతీయ యాజమాన్యం, జెండా కింద ఉండే 10,000 టన్నులు లేదా అంతకంటే ఎక్కువ బరువుండే వాణిజ్య నౌకలకు మౌలిక హోదా పొందే అర్హత ఉంటుంది. వాణిజ్య నౌకల నిర్మాణం భారత్‌లోనే జరిగితే మాత్రం 1500 లేదా అంతకంటే ఎక్కువ టన్నులుండి, భారతీయ యాజమాన్యం, జెండా కింద ఉన్నా ఈ హోదా లభిస్తుంది.