భారత్, నాలుగు ఐరోపా దేశాల కూటమి (ఈఎఫ్‌టీఏ) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ఒప్పందం ఫలితంగా రాబోయే 15 ఏళ్ల కాలంలో దేశంలోకి 100 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.90 లక్షల కోట్ల) పెట్టుబడులు వస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఇందువల్ల 10 లక్షల ఉద్యోగాల సృష్టికి అవకాశం ఉంటుందన్నారు.